తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో
చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’:
ఈనెల 18న విడుదల
……………………
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, “ఇదీ సంగతి” ‘ఆటగదరా శివా’ తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ . సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ, ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది.నా స్నేహితుడైన మదన్ తో ఈ కథను సినిమా గా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా. నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ వుంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ వుంటారు. అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టాను.
ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది.ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం వుంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.
హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: మదన్, సంగీతం: జే రెక్స్, పాటలు: చంద్ర సిద్ధార్థ్, మాటలు: పులగం చిన్నారాయణ, ఆర్ట్: అంజి కొయ్యల, సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్ , ఎడిటింగ్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్,
సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్, మహి, సమర్పణ: వై.వి.సత్యనారాయణ రాజు, నిర్మాత – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్.
CVR NEWS
ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సత్కరించారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పురస్కారాలు అందించారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 48 మంది ఉత్తమ టీచర్లకు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రదానం చేశారు. ఉన్నత విద్యా విభాగం నుంచి 21 మంది అధ్యాపకులు కూడా అవార్డులు అందుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని రాష్ట్రపతి అభినందించారు. విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, నైపుణ్యాలను పెంపొందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలను ఈ కార్యక్రమంలో కొనియాడారు. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక ప్రతిపాదన చేశారు. శాంతి చర్చలు సజావుగా సాగేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కో, ఆదివారం కైవ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రష్యా కూడా ఎయిర్‌స్ట్రైక్‌లు నిలిపివేయాలని కోరారు.
అమెరికా రాయబారుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, రష్యాను దృష్టిలో పెట్టుకుని కాదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు వాస్తవిక మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. మరోవైపు రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై వరుస వైమానిక దాడులు చేస్తుండగా, తాజా దాడుల తర్వాతే జెలెన్స్కీ కాల్పుల విరమణ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దక్షిణ అమెరికా ఖండంలోని బొలీవియాలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బొలీవియాలోని ఓ మిలిటరీ బేస్‌లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మిలిటరీ బేస్ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా అన్న దానిపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. అసలు పేలుడుకు కారణం ఏమిటనే దానిపై విచారణ ప్రారంభించారు. మిలిటరీ బేస్‌లో ఆయుధాలు లేదా ఇతర పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉంది. దార్చులా జిల్లాలోని అపి హిమల్ రూరల్ ప్రాంతం భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి చౌలానీ నది ప్రవాహానికి కొంత మేరకు అడ్డంకిగా మారాయి. దీంతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగితే దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. నది ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండచరియల కారణంగా నదికి అడ్డంకి ఏర్పడటంతో నీరు నిలిచి, ఒక్కసారిగా అడ్డంకి తొలగితే దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల కారణంగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తాజాగా చౌలానీ నదికి ఏర్పడిన అడ్డంకితో స్థానికుల్లో మరోసారి ఆందోళన నెలకొంది.
తెలంగాణలో ప్రజా పాలనను ప్రగతి పాలనగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ల సేవలను కొనియాడిన సీఎం.. తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గాయని.. అయితే 2026-27లో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ 7న విద్యా రంగంలో తెలంగాణ 28వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 17వ స్థానానికి చేరిందని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్షలు, నియామకాలు పారదర్శకంగా చేపట్టామని.. 25,950 మంది టీచర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రమోషన్లు ఇచ్చామని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని సీఎం స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు. ఈ ఏడాది తొలిసారిగా హైదరాబాద్ వెలుపల వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్, టెక్నికల్, విశ్వవిద్యాలయాల నుంచి ఎంపికైన 123 మంది ఉపాధ్యాయులు, ఆచార్యులకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రేవంత్ పేర్కొనగా.. గురువు స్థానం ఎంతో ఉన్నతమైనదని దామోదర రాజనర్సింహ కొనియాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఛత్రినాకలో విజయోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ బోయ వాల్మీకి వైస్ చైర్మన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బోయ నగేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని బోయ నగేష్ తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని బోయ నగేష్ సవాల్ విసిరారు.
నేపాల్‌లో వరదలు, కొండచరియల విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి–3A జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దాదాపు తొమ్మిది రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న వారిని తీవ్రంగా శ్రమించి రక్షించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, టన్నెల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల మధ్య సహాయక బృందాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగారు. టన్నెల్లో ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టన్నెల్లో చిక్కుకున్న వారి నుంచి శబ్దాలు వినిపించినట్లు సమాచారం అందడంతో.. రెస్క్యూ బృందాలు మరింత అప్రమత్తమయ్యాయి. మిగిలిన వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ.. బాధితులను రక్షించేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇద్దరిని సజీవంగా రక్షించడం సహాయక చర్యల్లో కీలక పరిణామంగా మారింది.
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం.
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
కథ నచ్చడం తో ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచడానికి సుముఖంగా ఉన్నారు , ఇది సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువల (రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్) తో భారీ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరించారు.
ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ: “మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చూసిన రషెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి, చిత్ర బృందం మొత్తం ఔట్పుట్ పట్ల ఎంతో నమ్మకంతో ఉంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘లీసా’ తెరకెక్కింది. ఇది ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది.
సినిమా మేకింగ్, అనన్య నాగళ్ల అద్భుతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ నెలలో సినిమాను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.
నటీనటులు: అనన్య నాగళ్ల, అల్లాల రవిరెడ్డి గారు, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు.