Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home International ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం

by Satya
Prime Minister Modi

‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్న ప్రధాని మోదీ(Prime Minister Modi)..

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో(Order of the Druke Gallop)’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు కొవిడ్‌ సమయంలో 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు గుర్తింపుగా ఇచ్చారు. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని, దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

దాషో షెరింగ్‌ తోబ్గేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు..

భూటాన్‌ ప్రధాని దాషో షెరింగ్‌ తోబ్గే(Tshering Tobgay)తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యటకం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై అవగాహన కుదుర్చుకున్నారు. రెండు రోజుల అధికార పర్యటనకు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం భూటాన్‌కు చేరుకున్నారు. వాస్తవానికి నిన్ననే ఈ పర్యటన ప్రారంభం కావాల్సింది. అనివార్య కారణాలతో ఒకరోజు జాప్యం జరిగింది. 2014లో భారత ప్రధానిగా అధికారం చేపట్టినప్పటినుంచి ఈ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. థింపూలో భారత నిధులతో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఈ సాల కప్ నందే… కప్ గెలిచాం


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ …
ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.
ఇరాన్ లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో తాము …
అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.
అమెరికా కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో అలసటతో నిద్రిస్తున్న …

Advertisements

You may also like

Our Visitor

025849
Total views : 149290

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.