Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home National నేడు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

నేడు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

by Satya
Central budget meetings

కాసేపట్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 6వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మల సమం చేయనున్నారు. నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ నుంచి బయల్దేరి పార్లమెంటుకు చేరుకున్నారు. ఈసారి ఆమె పేపర్ బడ్జెట్ ను కాకుండా డిజిటల్ ట్యాబ్లెట్ ద్వారా బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. రాజ్ భవన్ కు వెళ్లక ముందు ఆమె తన ఆర్థిక శాఖ కార్యాలయం ముందు తన బృందంతో కలిసి ఫొటొలు దిగారు. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. జులైలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. పేరుకు ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే అయినప్పటికీ కీలక పాలసీలకు సంబంధించిన మార్పులు బడ్జెట్ లో ఉండే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Our Visitor

039616
Total views : 198729

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: