Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు

వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు

by Rama
వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు

‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్త పేట మండలం వానపల్లిలో సీఎం పర్యటించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఉమ్మడి తూ.గో. జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం వానపల్లిలోని పళ్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వానపల్లి గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ‘గ్రామ సభలు’ పెట్టామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వానపల్లి గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నరేగా కింద రూ.4,500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నామని నరేగా కింద వంద రోజులు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు. ఈ పథకం కింద ఈ ఏడాది 84లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని సీఎం తెలిపారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నాకు. 2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగమని సీఎం చంద్రబాబు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: