మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో నమోదైన ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు షరతులు విధించింది. పాసుపోర్టును అప్పగించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 26 నుంచి నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు కావటంతో కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదల. మరోవైపు సుమారు రెండు నెలలుగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.జిల్లా కోర్టులోనూ ఒకట్రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జిల్లా కోర్టును వాటిని కొట్టివేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే పోలింగ్ సందర్భంగా పాల్వాయి గేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి. వీటితో పాటుగా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు జూన్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో నెల్లూరు జైలుకు తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్…
- తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..ప్రముఖ తమిళ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన పైనుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిగా పేరున్న రాజన్ ఆకస్మిక మరణం…
- ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది.ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించారు. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్సతో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే…
- ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
- తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 79999