Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Film దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

by CVR NEWS
దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల

టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో నరకం చూస్తోంది. ఆదరించేవారు లేక, చేతిలో డబ్బులేక ఆర్కే ఫౌండేషన్ లో తలదాచుకుంటుంది. ఇక గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతోన్న పావలా శ్యామల, ఆమె కూతురు కూకట్ పల్లిలోని ఒక హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం వెళ్లగా.. వారు డబ్బు లేదని వెనక్కి పంపారు. ఎక్కడకు తీసుకెళ్ళాలో తెలియని క్యాబ్ డ్రైవర్ వారిని గత రాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఆమెను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్ కి తరలించారు.

పావలా శ్యామల నడిరోడ్డుపై దిక్కులేని స్థితిలో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు గొప్ప మనసు చాటుకున్నాడు. పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించాడు. తల్లీకూతురిని ఒక రూమ్ కి తరలించి వారికి అన్ని సమకూర్చేలా చేశాడు. తమకు ఆపన్న హస్తం అందించిన దిల్ రాజుకు పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపింది. దిల్ రాజు మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: