Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News హైదరాబాద్ : అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై దాడి కేసు సంచలనం..

హైదరాబాద్ : అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై దాడి కేసు సంచలనం..

by CVR NEWS
హైదరాబాద్ : అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై దాడి కేసు సంచలనం

అమీర్‌పేట్‌లో గర్ల్స్ హాస్టల్‌పై జరిగిన దాడి ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. దాదాపు 30 మంది వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేశారని ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్” నిర్వాహకుడు పంజాగుట్ట పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కోర్టు “యథాతథ స్థితి” ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ… రాజకీయ పలుకుబడితో ఒత్తిళ్లు తెచ్చి హాస్టల్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ మేరకు మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సహా భవన యజమానులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం ఈ వ్యవహారం మరింత హీటెక్కింది. సిబ్బందిపై దాడులు, మొబైల్ ఫోన్ల స్వాధీనం, వీడియోలు డిలీట్ చేయడం వంటి ఆరోపణలు కేసును మరింత సీరియస్‌గా మార్చాయి. ముఖ్యంగా అమ్మాయిల హాస్టల్‌లోకి దుండగులు ప్రవేశించారన్న అంశం మహిళల భద్రతను లేవనెత్తుతోంది. సివిల్ వివాదం పేరుతో ప్రైవేట్ సేనలను రంగంలోకి దింపుతున్నారా..? రాజకీయ ప్రభావంతో చట్టాన్ని పక్కన పెట్టే ప్రయత్నమా..? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట సిఐ రామకృష్ణ వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: