నంద్యాల జిల్లా డోన్ లో 03.04.2024 మధ్యాహ్నం డోన్ టౌన్ శ్రీ రామ నగరం నాయకల్లు భరత్ చంద్ర, బోయ ఉదయ్ ఇద్దరు పత్తికొండ ఏరియాలో ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి డోనులో అమ్ముకోడం కొరకు ఇద్దరు పంచుకుంటుండగా పోలీసులకు సమాచారం రావడంతో 1100 గ్రాములు గంజాయి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేయడమేమనగా ఎక్కువ శాతం యువతనే గంజాయి తీసుకుంటున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని డోన్ సీఐ తెలిపారు. వీరి దగ్గర నుంచి ఎవరు అమ్ముతున్నారు. అన్నా విషయంపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
Crime
అత్యాచార బాధిత యువతి (18)ని దుస్తులు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించిన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లా మేజిస్ట్రేట్ (magistrate)పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 30న బాధిత దళిత యువతి ఫిర్యాదు మేరకు హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్సీ-ఎస్టీ) సెల్ మీనా తెలిపారు.
బాధిత యువతి దుస్తులు విప్పేందుకు నిరాకరించిందని, వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్‌పై ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వంలోని బృందానికి కేసును బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. వాంగ్మూలం నమోదు చేసేందుకు నిన్న అజయ్‌సింగ్ బాధిత బాలికను కలిశారు. కాగా, బాధిత యువతిపై మార్చి 19న ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది చదవండి: ఎన్నికల ప్రచారం లో కురసాల కన్నబాబు..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం సాయంత్రం ఏనుగు దాడి(Elephant Attack) అల జడి సృష్టించిన ఒక రైతు మృతి(Farmer’s death) చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు ప్రవేశించింది. రైతును హతమార్చిన తర్వాత లంబాడీ హెటీ, గంగాపూర్ వైపు ఏనుగు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. తిరిగి మహారాష్ట్ర అడవు ల్లోకి పంపేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. గ్రామస్థులు తెలిపిన వివరా ల ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అటవీ ప్రాంతం నుంచి బూరెపల్లి గ్రామ శివారులోకి వచ్చిన ఏనుగు అక్కడే ఉన్న మిర్చి తోటలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అల్లూరి శంకర్(56) అనే రైతు, అతడి భార్య అక్కడ పను ల్లో ఉన్నారు.
ఇది చదవండి: Fire Accident | మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం..!
ఏనుగును గమనించిన శంకర్ దాన్ని తరిమేందుకు ప్రయత్నించ గా అతడిపై అది దాడి చేసింది. కాళ్లతో తొక్కగా తీవ్రగాయాలైన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయంతో పరుగులు తీసిన భార్య గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై అటవీ శాఖ అధి కారి ఒకరు మాట్లాడుతూ… తెలంగాణలో ఏనుగుల సంచారం లేదన్నారు. ప్రాణహిత నదికి అవత లవైపు మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లాలో 70 నుంచి 75 ఏనుగుల మంద సంచ రిస్తోందని తెలిపారు. వీటి లో ఒక మగ ఏనుగు దారి తప్పి నది దాటి ఇవతలికి వచ్చిందని వెల్లడించారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శంకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీ వ్యాన్ ఢీకొట్టిన లారీ. ఈ రోడ్డు ప్రమాదం లో ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు. చనిపోయిన వారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. క్షతగాత్రులను కేజిహెచ్ కు తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు.
ఇది చదవండి:
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తెలంగాణ(Telangana)లోని సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఇక్కడి ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ ఫైర్..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఘంటసాల మండలం లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. మృతులు చల్లపల్లి మండలం పచ్ఛార్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 108 వైద్య సిబ్బంది సంఘటన చేరుకొని వైద్య పరీక్షలు చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చల్లపల్లి సిఐ చిన్ని నాగ ప్రసాద్ ఆదేశాలతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇది చదవండి: ఏపీలో మార్పు కేవలం కూటమి తోనే సాధ్యం..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టంగుటూరు ఎస్సై (Tangutoor SI)..
లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై (Tangutoor SI) ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్ఐను పట్టుకున్నారు. టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెంలో వైసీపీకి చెందిన మార్టూరి వెంకట్రావు అనుమతి లేకుండా పొగాకు బ్యారన్లు నిర్మిస్తుండటంపై కొద్దిరోజుల క్రితం అప్పటి పంచాయతీ కార్యదర్శి సాంబయ్య ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బ్యారన్ నిర్మిస్తున్న మార్టూరి వెంకట్రావు తనను సర్పంచ్ తనయులు కొమ్మినేని వెంకట్రావు, శ్రీనివాసరావు బెదిరిస్తున్నారని ఎస్ఐకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి : కడప తహసీల్దార్ అరెస్ట్.. రిమాండ్…
కేసు పెట్టకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్..
దీంతో సర్పంచ్ తనయుడు వెంకట్రావును స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై.. ‘బ్యారన్లు నిర్మిస్తున్న వెంకట్రావును మీరు బెదిరిస్తున్నట్టు అతను ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేస్తున్నా’ అని స్పష్టం చేశారు. కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష డిమాండ్ చేశాడు. అందుకు ఆయన అంగీకరించాడు. సర్పంచ్ రెండో కుమారుడైన శ్రీనివాసరావు తొలివిడత గత నెల 29న ఎస్సైకి రూ.30వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బులు త్వరగా ఇవ్వాలని ఎస్ఐ హుకుం జారీ చేయడంతో సర్పంచ్ తనయులు ఈ నెల 1న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు శ్రీనివాసరావు మంగళవారం టంగుటూరు వచ్చారు. అనంతరం ఎస్ఐకి ఫోన్ చేయగా, స్థానిక చెల్లమ్మతోటలోని తన నివాసానికి రావాలని సూచించారు. అక్కడ ఎస్ఐకు రూ.70 వేలు ఇవ్వగానే అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వి. శ్రీనివాసరావు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
మహారాష్ట్ర(Maharashtra)లోని ఛత్రపతి షంబాజీ నగర్(Chhatrapati Shambaji Nagar)లో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఓ క్లాత్ స్టోర్‌లో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఇది చదవండి: మార్కెట్లో ఇంకా ఎన్ని 2000 రూపాయల నోట్లు ఉన్నాయో!
ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఏడుగురు మృతి చెందినట్లు ఐడెంటిఫై చేశారు. ఇక నివాసాల మధ్యలోనే ఈ ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రాఘవేంద్ర కాలనీలో మాధవ రెడ్డి(Madhava Reddy), సరిత దంపతులు నివసిస్తున్నారు. సరిత ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. దీంతో, దుండగులు తాళం పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారు నగలు, 2లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబెడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి రాజమ్మ 80 సంవత్సరాలు గల ఆమెకు ఇద్దరి సంతానంలో రెండవ కొడుకు కృష్ణారెడ్డి అతని కొడుకులు కలిసి మంగళవారం మధ్యాహ్నం రాజమ్మతో గొడవ పడుతూ గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం.
ఈ ఆస్తి గొడవకు కారణం ఆమెపై ఒక ఎకరం వ్యవసాయ భూమిని చిన్న కొడుకుకు కృష్ణారెడ్డికి కాదంటూ పెద్ద కొడుకు కుమారుడు హరి రెడ్డికి రాసిచ్చినందున సుమారు రెండు నెలలుగా గొడవలు కొనసాగిస్తూ ఉండడంతో ఇలాంటి దారుణానికి కసాయి కొడుకు, కోడలు హత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. ఇదే విషయంపై ఎస్ ఐ కి రాజమ్మ పెద్ద కొడుకు కుమారుడు హరి రెడ్డి ఫిర్యాదు కొద్ది నిమిషాల ముందు చేయడంతో అప్రమత్తమైన హంతకులు చాలా కిరాతకంగా గొంతు కోసి చంపి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.