నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠా అరెస్ట్. అంతరాష్ట్ర డ్రగ్స్ ను అరెస్ట్ చేసిన రాచకొండ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. రాజస్థాన్ నుండి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్నారు. ఓపియం డ్రగ్ 3.4 కేజీలు , 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాదినం చేసుకున్నాం. 2.8 లక్షలు నగదు సీజ్ చేసాం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన SOT పోలీసులు అరెస్ట్ చేసారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ బాయ్ లను అరెస్ట్ చేసాం. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెస్తున్నారు. డ్రగ్స్ ను నిర్ములించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నాం.
Crime
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. ముంబై దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్ ఉన్నాడు. 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబైలో ఉన్న తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ తిరస్కరిస్తూ వస్తోంది. ముంబై పోలీసులు దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి వివరించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో భారత్ ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో దొంగల హల్చల్, మాచర్ల నెహ్రూ నగర్ 2వ. లైన్ లో నివాసం ఉంటున్న మేకల సురేష్ ఇంట్లో దొంగతనం. శనివారము రెంటచింతలో అత్త రింటికి వెళ్లి ఆదివారం తిరిగి మధ్య హనం ఇంటికి వచ్చి చూసుకునే లోపు దొంగతనం, సుమారు మూడు లక్షల బంగారు ఆభరణాలు, 50000 నగదు దొంగతనం జరిగిందని మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేస్ నమోదు చేసి విచారిస్తున్న పోలిసులు.
హైదరాబాద్ పబ్బుల్లో సోదాలు చేస్తున్న పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పోలీసులు. నిక్స్. డౌన్ టన్. పబ్బులు స్లీపర్ స్నిపర్ లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించిన పోలీసులు. మొదటిసారి స్నిపర్ డాగులను వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది అందులో వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి పరిస్తితి ఆందోళన కరంగ వుంది అని తెలిసింది ఒస్మానియా లో చికిత్స పొందుతూ ఉన్నట్లు సమాచారం, వివరాల్లోకి వెళితే బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్ షిప్ లోని ఒక ప్లాట్ లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం ఆ ప్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది అందులో కి హమీద్ హుస్సేన్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు తెలియదు కానీ అక్కడ ఏదో వెదుకుతూ ఉండగా ఒక్క బ్లాస్ట్ అవ్వటం ప్రక్కనే ఉన్న మసీదు కిటికీ అద్దాలు కూడా పగిలి పోవటం తో పెద్ద ఎత్తున చప్పుడు కావటం తో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉండటం తో పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్య కుంటలో ఒక వ్యక్తి అనుమానస్పద మృతి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కొరకు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించిన పోలీసులు. ఈమెరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కృష్ణాజిల్లా.. గన్నవరం పంచాయతీ ఏరియాలోని కొనై చెరువు వద్ద డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆగిరిపల్లి గన్నవరం ప్రధాన రహదారి. రోడ్డుకి ఇరువైపులా నిర్లక్ష్యంగా పడవేస్తున్న చెత్త కారణంగా దుర్వాసనతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం గగ్గోలు పెడుతున్న గన్నవరం పంచాయతీ తీరు నిమ్మకు నేరెత్తని వైనం గా వ్యవహరిస్తుంది. గతంలో కొన్ని మీడియా ఛానల్లో పేపర్లో వార్తలు వచ్చిన స్పందించని పంచాయతీ అధికారులు, గన్నవరం పంచాయతీ లో ఈ చెత్తను తరలించి వేరే చోట డంపింగ్ చేయడానికి కోట్లలో గతంలో అవినీతి జరిగినట్టు నిరూపణ, రోడ్డు వెంబడి ఇరువైపులా ఉన్న చెత్తకు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడంతో ద్విచక్ర వాహనదారుడు దారి తెలియక వేరే వాహనంను ఢీ కొట్టాడు. క్షతగాత్రుని స్థానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా అగ్నిమాపక శకటం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు.
శ్రీకాళహస్తి తొండమనాడు రోడ్డులోని అమ్మ పాలెం క్రాస్ రోడ్డు వద్ద చుక్కల నిడిగల్లు పంట కాలువలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గోతాలు టెంకాయ మట్టలతో కప్పి వుండటంతో ఏదో జంతువు మృత దేహామని గ్రామస్తులు అనుకున్నారు. పరిశీలిస్తే అది అమ్మాయి మృతు దేహమని తెలుసుకొని భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ అజయ్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసు విచారణలో ఆ యువతీ సమీప గ్రామాలకు చెందినది కాదని గ్రామస్తులు చెప్పారు. శరీరంపై కనపడని రక్త గాయాలు ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారా ఇక్కడే హత్య జరిగిందా ? ఆ యువతి ఎవరు? ఎవరు హత్య చేసి ఉండొచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Read Also..
2012 నాటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరహాలో రాజస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం జరిగింది. కాన్పూర్ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఓ బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫూల్‌చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు రాత్రి సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్లో కూర్చుంది. క్యాబిన్లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్‌చంద్ మీనా వివరించారు.