Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్‌

జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్‌

by Rama
జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్‌

జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రవి కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్‌ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్‌ శివ రామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌ను ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
కాగా వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎగవేత ద్వారా ఏకంగా వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్‌. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదాపు రూ. 400కోట్లు పన్ను చెల్లింపులు ఎగవేసినట్టు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు మానవ వనరులను అందించే బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏమాత్రం ట్యాక్స్ కట్టకుండానే ఏకంగా 25.51కోట్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకుందని, అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాణిజ్యపన్నులశాఖకు సాంకేతికతను అందించే సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్‌ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్‌ప్రొవైడర్‌ చేయాల్సిన పని.కానీ బిగ్‌లీప్‌ టెక్నాలజీస్‌ అక్రమాలను ఐఐటీ హైదరాబాద్‌ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ స్క్రూటినీ మాడ్యూల్ కూడా గుర్తించలేకపోయిందని వివరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039480
Total views : 197064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: