Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Devotional శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

by CVR NEWS
శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్లో టికెట్స్ పొందిన భక్తులకు మాత్రమే యధావిధిగా స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు కంపార్టుమెంట్లలో బారులు తీరారు. దర్శనానికి5 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

040019
Total views : 202968

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: