30
అయోధ్య రాముడి ఆలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదిక పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వస్తున్న విరాళాల అవకతవకల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధులు పక్కదారి పట్టాయంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అక్రమాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ తక్షణమే తాజా నివేదికను సమర్పించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



Total views : 207682