శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు. కామాక్షితాయి ఆశీస్సులతో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేసారు.
Devotional
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శివాలయం, విష్ణు ఆలయంలా వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివాలయం పూజారి వీర కుమార్ మాట్లాడుతూ శివాలయం, విష్ణు ఆలయంలకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఆయన అన్నారు. అలాగే అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శివాలయం, విష్ణులయం పునఃప్రారంభించి 12 సంవత్సరాల కావస్తున్న సందర్భంలో 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుపుకుని అనంతరం అన్న సమారాధన జరపటం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు పదివేల మంది భక్తులు పాల్గొటం జరిగిందని ఆయన అన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసే పేటలో వెలసిన చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల శోభాయాత్ర శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి పంచామృతా, కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. పంచమ జ్యోతులను తలపై ఎత్తుకొని పురవీధుల్లో అమ్మవారి పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. పంచమ జ్యోతుల శోభాయాత్రను తిలకించుటకు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
శుక్రవారం ఉదయం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చిన ఈఓ ధర్మారెడ్డి భక్తులు సూచించిన సలహాలు తీసూన్నారు. శ్రీవారి సేవలో పాల్గొనాలని ముస్లీం భక్తులు కోరడం సంతోషంగా ఉందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ముస్లీం భక్తులు శ్రీవారి సేవకు వచ్చేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించి.. అన్యమతస్థులైన వారు శ్రీవారి సేవకు రావాలనుకున్న వారి కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సూచించారు. ఇప్పటికే నిర్మాణం అయిన క్యూలైన్ లు భక్తుల రద్దీ సమయంలో సరిపోకపోవడంతో మరో క్యూలైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ. 15 కోట్లతో శిలాతోరణం వరకు క్యూలైన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు సిలిండర్ల ద్వారా తిరుమలలో గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి సాద్యాసాద్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక జనవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21.09 లక్షలని వెల్లడించారు. కానుకల రూపంలో హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.116.46 కోట్లని తెలిపారు. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.03 కోట్లన్నారు. 46.46 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని.. 7.05 లక్షల మంది భక్తులు తలనీలాలు
Read Also..
NTR జిల్లా, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు రంగుల మహోత్సవంలో అధికారులు వైఫల్యం. అర్థరాత్రి 12గంటలు దాటిన గ్రామ మండపానికి చేరుకొని ఎంపిక చేసిన ఎద్దుల బండ్లు, ఆలస్యంగా మండపానికి చేరుకున్న రెండు బండ్లు. అమ్మవారిని జగ్గయ్యపేట సాగనంపేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహిళలు, భక్తులు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. సమయపాలన పాటించకపోవడంతో అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళ భక్తులు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా లోకేష్ దంపతులు. లోకేష్ కుటుంభానికి వేదాశీర్వచనాలతో అర్చకులు ఆశీర్వదించారు. అమ్మవార్ల జ్ఞాపికను ఆలయ అధికారులు నారా లోకేష్ దంపతులకు అందించారు.
కర్నూలు జిల్లా, మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు. మంగళవారం హుండీ లెక్కింపు పూర్తి కావడంతో 33 రోజుల హుండీ ఆదాయం రూ 4 కోట్ల 15 లక్షల 32 వేల 738 రూపాయలు నగదు, 44 గ్రాములు బంగారం, 3642 గ్రాముల వెండి ఆదాయం వచ్చింది. జనవరి నెల లో ఎక్కువ గా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భారీ ఆదాయం వచ్చిందని మఠం మేనేజర్ తెలిపారు. శ్రీ మఠం చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఆదాయం రాలేదని ఇదే మొదటిసారి అని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు తెలిపారు. ఈ నగదును అన్నదానం, జీత భత్యాలు, స్వామి వారి నైవేద్యం, శ్రీ మఠం పరిశుభ్రత కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు.
ప్రాచీన ఆలయాల కంటే భిన్నింగా సాయిబాబా ఆలయాలుంటాయి. ఎత్తైన గోపురాలు, గర్భగుడిలేకుండా బాబా ఆలయాలుంటాయి. ఎక్కడ చూసినా ఆలయ నిర్మాణం ఒకేలా అనిపిస్తుంది. అంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఉన్న బాబా ఆలయం మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తుంది. దక్షిణ శిరిడీగా పేరుగాంచిన ఆలయాన్ని చూస్తుంటే నక్షత్రాన్ని తలపిస్తుంది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా భావించే కర్నూలులోని దక్షిణ షిరిడి సాయిబాబా వెలసిన దక్షిణ షిర్డీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 70ఏళ్ల కిందట నిర్మించిన ప్రత్యేక ఆలయం ఇది. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం తుంగభద్రా నది తీరాన 1.5 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా నిర్మించారు. ఈ ఆలయం తుంగభద్రానది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. నక్షత్రం ఆకారంలో ఉండటం ఈ ఆలయప్రత్యేకత. ఈ ఆలయవాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి, హనుమంతుని విగ్రహాలు కూడాఉన్నాయి. ఈ ఆలయాన్ని అన్నివేళల్లో సందర్శించుకునేందుకు అవకాశముంది. కానీ ప్రత్యేక పూజలు మాత్రం ఉదయం, సాయంత్రం వేళల్లోనే నిర్వహిస్తారు. తుంగభద్రా నది నుండి వీచే చల్లనిగాలి ఈ ప్రదేశాన్నిఎంతో ఆహ్లదాన్ని పంచుతుంది. దాదాపు 800 మంది కూర్చుని ధ్యానం చేసుకునే వెలుసుబాటు ఉండేలా పెద్దధ్యాన మందిరాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.
జ్ఞానవాపి కేసు సంచలన మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలోకి హిందూ దేవుళ్ల ప్రతిమలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో హిందువులు పూజలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అందుకు జిల్లా యంత్రాంగం వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్పు చారిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణమోహన్ పాండే ఆదేశాలిచ్చారు. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు బేస్మెంట్ను తెరవాలని ఆదేశాలు వచ్చాయి. రామ జన్మభూమిలాగే ఈ వివాదంలోనూ హిందువులు విజయం సాధిస్తారని హిందూ వర్గం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు. వారణాసి కోర్టు తాజా ఉత్తర్వులను హిందువుల విజయంగా కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణించింది. కోర్టు ఉత్తర్వులతో సీల్ చేసిన మసీదు బేస్మెంట్ ప్రాంతంలో ఉన్న హిందూ దేవత విగ్రహాలకు పూజలను ప్రారంభిస్తామని పేర్కొంది. కాశీ ఆలయ పూజారులే పూజలు నిర్వహిస్తారని తెలిపింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ ASI సర్వే నిర్వహిస్తున్నందున బేస్మెంట్ను సీల్ చేసిన విషయం తెలిసిందే. ఐతే కోర్టు తాజా ఉత్తర్వులతో బేస్మెంట్ బారీకేడ్లను తొలగించనున్నారు.
ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.