పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక ఉత్సవ మహోత్సవాలు నెల రోజులు పాటు ఘనంగా నిర్వహించారు.. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు సర్వజగత్తుకు ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా చివరి రోజున భక్తులకు దర్శనమిస్తున్నారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు లక్ష మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, అఖండ అన్న సమారాధనను ప్రారంభించారు. నెల రోజులు పాటు అమ్మవారి సన్నిధిలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని 1 లక్ష 60 వేల రూపాయలకు గ్రంధి శ్రీనివాస్ యూత్ దక్కించుకున్నారు. శ్రీ మావుళ్ళమ్మ 60వ వార్షిక ఉత్సవ వార్షికోత్సవంలో రాష్ట్రంలోని అఖండ అన్న సమారాధనలో భక్తులు లక్షల్లో ప్రతి సంవత్సరం పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు.
Devotional
AP Home Minister Taneti Vanitha :
ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయత్రం తిరుమలకు చేరుకున్న ఏపీ హోమ్ శాఖామంత్రి రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించిగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న హోమ్ శాఖామంత్రి తానేటి వనితకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల హోమ్ శాఖామంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరలా రాష్ట్రానికి సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే కావాలని కోరుకునట్లు తెలిపారు. సీఎం జగన్ అందించిన సుపరిపాలన, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఎన్నికల్లో సీఎంగా మరలా జగన్ నే చేయాలని కోరుకుంటారన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహా అపచారం చోటుచేసుకుంది. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి గుడి వెనుక భాగాన గల తీర్థ ప్రసాదాల వితరణ వద్ద పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క ప్రత్యక్షం కావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వేణుగోపాల్ అనే భక్తుడు ఉదయం 11.53 నిమిషాలకు స్వామి అమ్మవార్ల దర్శనం ముగించుకొని అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రసాదంలో కనిపించిన మాంసపు ముక్కను చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు. దైవ దర్శనం కోసం వచ్చి మాంసపు ముక్కను కలిపిన ప్రసాదాన్ని తినడం అపచారంగా భావించిన భక్తులు ఆలయ పరిపాలన భవనంలో ఆలయ ఏఈవో హరిదాసు మరియు ఆలయ సహాయ కమిషనర్ హెచ్ వెంకటేష్ కి లికిత పూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో పాటు మాంసపు ముక్కను కూడా అందజేయడం జరిగిందని భక్తుడు వేణుగోపాల్ తెలిపారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యము మరియు సుచి శుభ్రత లేని ప్రసాద వితరణ మా మనోభావాలను భారీగా దెబ్బతీశారు అంటూ ఆందోళన చెందుతున్న భక్తులు తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.
శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న భక్తులకు దేవస్థానం చేపట్టాల్సిన సౌకర్యాలపై ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దేవస్థాన పరిసాలన భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమీక్షకు కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై శాఖలవారీగా సమీక్ష నిర్వహిస్తారు. మంచినీటి సరఫరా, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, వసతి, లైటింగ్ ఏర్పాట్లు, ఉత్సవ క్రతువులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయలు తాత్కాలిక వసతి, శౌచాలయాలు తదితర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు ఈ సమావేశానికి మూడు జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొంటారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న బీహార్ కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయ రాజా గోపురం వద్దకు చేరుకున్న బీహార్ కాంగ్రెస్ 22 మంది ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అధికారులు అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యేలకు శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. అయితే గత కొద్ది రోజులుగా బీహార్లో ప్రభుత్వంపై బల ప్రదర్శన నిర్వహించాలని ఈ నెల 12న బలపరీక్ష ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్నారని సమాచారం. అందులో భాగంగానే నేడు శ్రీశైలం, రేపు జోగులాంబ గద్వాల జిల్లాకు వెళుతున్నట్టుగా సమాచారం బీహార్ ఎమ్మెల్యేల వెంట తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా వెంటే ఉండి బీహార్ ఎమ్మెల్యేకు దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. శ్రీశైలం పర్యటన దర్శనానంతరం తెలంగాణ అలంపూర్ జోగులాంబ ఆలయానికి బీహార్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని చండీశ్వర సధన్ వద్ద భారీ కొండచిలువ అర్ధరాత్రి హల్ చల్ చేసింది. కొంతసేపు అటూఇటూ తిరుగుతూ భక్తులను గందరగోళానికి గురి చేసింది. కొండచిలువను చూసిన భక్తులు, స్దానికులు భయాందోళనకు గురయ్యారు. చండీశ్వర సధన్ లో దేవస్థానం ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. అయితే అర్ధరాత్రి భారీ కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో ఉద్యోగులు కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు. చండీశ్వర సధన్ చుట్టుప్రక్కల భక్తుల వసతీ గదుల సత్రాలు ఉండటంతో కొండచిలువను గమనించిన భక్తులు స్దానికులకు సమాచారం అందించారు. విషయం ఆనోటా ఈనోట పడగానే కొండచిలువను చూసేందుకు చుట్టుప్రక్కల వాళ్లు గుంపులుగా తరలివచ్చారు. జనారణ్యంలోకి కొండచిలువ రావడంతో చుటుపక్కల వారు స్నేక్ క్యాచర్ రాజాకు సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి కొండచిలువ ఉండే ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా కొండచిలువని పట్టుకుని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీనితో చండీశ్వర సధన్ లోని ఉద్యోగులు స్దానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. Read Also
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రథసప్తమి రోజు భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ పకడ్బంధీగా చేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దేవస్థానం అధికారులు విధించే నియమ, నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అప్పుడే వేడుకలలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించాలి అని ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి రథసప్తమికి భక్తులు అరసవల్లి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు.
ఇలవైకుంఠంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు దర్శించుకున్నారు. దేవానంద చిన్న జీయర్ స్వామి., కుక్కే సుబ్రమణ్య పీఠాధిపతి విద్యా ప్రసన్న తీర్థులు., వ్యాసరాజు మఠం పీఠాధిపతి విద్యా తీర్థ స్వామీజీ., సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్థ నంద స్వామి., విశ్వ గురు ఆశ్రమం విశ్వయోగి స్వామీజీ., భువనేశ్వరి తీర్థ చిదానంద ఆశ్రమం సత్యానంద భారతి స్వామి., కడప బ్రహ్మంగారిమఠం విరజానంద స్వామీజీలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతులను, మఠాధిపతులను శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. అంతకమునుపు ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న పీఠాధిపతులను, మఠాధిపతులను ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఇస్థికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
నేడు తిరుమలలో ధార్మిక సదస్సు, దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు, పీఠాధిపతులు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ. మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ. తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ. సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.