ఎన్టీఆర్ జిల్లా, మైలవరంనియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం. కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో మహిళలు భక్తిశ్రద్దలతో పోలిస్వర్గం కి సాగనంపుతారు. నెలమొత్తం ఎంతగానో ఉపవాసం, నోములు, వ్రతాలు చేసి తమ పసుపు కుంకుమ లు చల్లగా ఉండాలని పరమశివుని ప్రార్థిస్తూ నదిలో పుణ్య స్నానం చేసి దీపాలు వెలిగించి నదిలో వదిలి పూజలు ముగించుకుంటారు. విజయవాడ వన్ టౌన్ కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కృష్ణా నదిలో స్థానమాచరిస్తున్న భక్తులతో కిటకిటలాడుతున్న కృష్ణమ్మ.
Devotional
ఆస్ట్రేలియాకు చెందిన హిందూ ఆధ్యాత్మిక భక్తురాలు జోర్డి మూర్ హిందూ ధర్మంపై నమ్మకంతో చతురామ్నాయ పీఠాలను పాదయాత్రగా నడిచి వెళ్లాలని సంకల్పంతో 6410 కిలోమీటర్లు 8 నెలల కాలం నుంచి నడుస్తున్నటువంటి ఆమె మన ప్రాంతం మీదిగా వెళ్లడం జరుగుతుంది. ఇర్రిపాక లో జరగనున్న మహా కుంభాభిషేకానికి కోటి మట్టి శివలింగాల తయారీలో పాల్గొనడానికి సోమవరం గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు జ్యోతుల లక్ష్మీదేవి, జ్యోతుల అనీష్ నెహ్రూ, ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుండి ఆమె వెంట లక్ష్మీదేవి, అనీష్ నెహ్రూ పాదయాత్ర చేసుకుంటూ ఇర్రిపాక శివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వేద పండితులు, జ్యోతుల మణి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మట్టి శివలింగాల తయారీలో పాల్గొని మహా కుంభాభిషేక విషయాలను లక్ష్మీదేవిని మణిని అడిగి తెలుసుకున్నారు. ఈ తయారవుతున్న కోటి మట్టి శివలింగాలతో ఇక్కడే మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆ ఏర్పాట్లను ఆమెకు వివరించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మట్టి శివలింగాల తయారీలో జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు సుమారు వందమంది పాల్గొని మట్టి శివలింగాలు తయారు చేశారు.
తిరుమల, శ్రీవారి సేవలో ఏపి మంత్రి గుడివాడ అమర్నాథ్. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్నా. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని ప్రార్ధించా. తుఫాన్ కారణంగా దేవుడి దయ వల్ల ఎక్కడా ప్రాణహాని జరగలేదు. పంట నష్టం జరిగిన ప్రదేశాల్లో స్వయంగా సీఎం పరిశీలించి, రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్ట పరిహారం చేల్లించారు. ఈ నెల 15వ తారీఖున క్యాబినెట్ సమావేశంలో ప్రజలకు అనుకూలంగా, రాష్ట్రంకు మెలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నాం. జనవరి 1వ తారీకు నుండి పింఛను దారులందరికి 3 వేల రూపాయలు అందజేయనున్నాం. 15వ తారీఖు నుండి ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంకు నాంది పలకనున్నాం. వైసీపి ఇచ్చిన ఘన విజయం గతంలో ఎన్నడూ ప్రజలు వేరే పార్టీకి ఇవ్వలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినప్పటి నుండి సీఎం అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోక పోయే ఎమ్మెల్యేలను ప్రక్కన పెడుతాంమని సీఎం చెప్పారు. 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో పార్టి నుండి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటాం. ఒకరు భాధ పడ్డారనో, ఒకరి గురించి లక్షమందిని భాధ పెట్టే పని సీఎం ఎప్పుడూ చేయరు. పార్టీ ఫిరాయింపులు టీ కప్పుల్లో తుఫాను లాంటి మాత్రమే, మళ్ళి సద్దుకుంటాయ్. జగన్ ను సీఎం చేసేందుకు, రాష్ట్ర ప్రజలందరికి మంచి చేసేందుకు కలిసి కట్టుగా అందరం పని చేస్తాం.
మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా పేర్కొంది. మసీదు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షియా ముస్లిం మహిళలను మసీదు, ఇతర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించట్లేదంటూ అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. ఇబ్దత్కానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించడంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఉపయోగం లేకపోయిందని చెప్పారు. మరోవైపు, ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే, మహిళలపై వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం వారికి సమానత్వ హక్కులు కల్పించిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవల్లీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు, అంగరంగ వైభవంగా కార్తీక మాస వేడుకలు. దీపావళి అనంతరం దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే ఇందులో భాగంగానే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందువులు ప్రతిరోజు శివుని ఆలయానికి వెళ్లి దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలలో దీపాలతో దీపారాధన చేస్తారు. కొంతమంది 365 దీపాలతో మరి కొంతమంది లక్ష దీపాలతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ కార్తీకమాసంలోనే హిందువులు వనభోజనాలకు వెళ్లి సరదాగా సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వేకోడూరు పట్టణంలో నడిబొడ్డున వెలసి ఉన్న భుజంగేశ్వర స్వామి ఆలయంలో రైల్వే కోడూరు ఉపసర్పంచ్ తోట శివ సాయి సహకారంతో భుజంగేశ్వర ఆలయ చైర్మన్ పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్తీకమాసం మొదటి రోజు నుండి నేటి వరకు అనగా నెల రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులతో లక్షలాది దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు తమ భక్తుని చాటుకున్నారు. ప్రత్యేకించి సోమవారాలలో అంగరంగ వైభవంగా పూజలు, అన్నదానాలు, భజన కార్యక్రమాలు, దీపారాధనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భుజంకేశ్వర ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. నాలుగవ కార్తిక సోమవారం నాడు మిచౌంగ్ తుఫాన్ సైతం లెక్కచేయకుండా జోరు వానలో హోరుగా అన్నదానాలు, భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తులు పోటెత్తిపోయారు. కార్తీక మాసం పూలు పండ్లు, కాయ కర్పూరం లాంటి చిరు దుకాణాల వ్యాపారులకు కనక వర్షం కురిపించింది. ఏది ఏమైనప్పటికీ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో భుజంగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తిపోయారు. చివరి వారం కావడంతో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి భుజంగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రైల్వే కోడూరు ప్రజలు, వర్తకులు, రైతులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించాలని కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి తెలియజేశారు.
శ్రీశైలంలో కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస చివరి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది ఈ లక్షదీపోత్సవంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భక్తులు,ఆలయ సిబ్బంది కార్తీక దీపాలను వెలిగించారు రేపటి అమావాస్యతో శ్రీశైలంలో కార్తీక మసోత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లివచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ అటుగా వెళ్లే యాత్రకుల కళ్ళకు కనువిందు చేస్తూ కనపడ్డాయి. దీనితో నీటి కుక్కల కళ్ళను చూపుర్లను కట్టిపడేస్తున్నాయి. నీటి కుక్కలు ముఖ్యంగా ఎగువన వర్షాలు పడినప్పుడు నీళ్లు పెరిగిన, లేదా డ్యామ్ లో నీటిమట్టం తగ్గిన శ్రీశైలం జలాశయం పరిసరాలలో చేపల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నీటి కుక్కలు ఒడ్డుకు వచ్చి సందడి చేస్తాయి. అలానే ప్రతి సంవత్సరం శ్రీశైలం పాతాళగంగలో ఏపీ టూరిజం ఏర్పాటు చేసుకున్న జెట్టుపై విన్యాసాలు చేస్తూ కనువిందు చేస్తుంటాయి. నీటి కుక్కలు సాధారణంగా మనిషి కనపడిన శబ్దం చేసిన తుర్రుమంటూ మాయమవుతాయి. ఈరోజు ఉదయం సమయంలో నీటి కుక్కలు శ్రీశైలంలోని పాతాళగంగా మెట్ల మార్గం దగ్గర టూరిజం శాఖ జెట్టుపై ఒక్కసారిగా ప్రత్యక్షమై కనపడంతో యాత్రికులకు కనువిందు చేసాయి. అయితే యాత్రికులు సైతం తమ సెల్ ఫోన్ లో నీటి కుక్కల సందడిని చిత్రీకరించారు. నీటి కుక్కలు పాతాళగంగకు వెళ్లే వారికి వీటిని చూస్తూ ఆనందంతో పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో నరసాపురం వశిష్ట గోదావరి వలందర్ రేవులో తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీకదీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి సమీపంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా పుణ్యఫలం పొందుకుంటామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నరసాపురం పట్టణంలోని కపిల మల్లేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లక్షదీపార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో నరసాపురం వశిష్ట గోదావరి తీరం జన సందోహంగా మారింది. ప్రతి ఏటా కార్తీక మాసం సందర్భంగా ఈ వలందర్ రేవులో నిత్యం వేలాది మంది భక్తులు కార్తీకదీపాలను వదిలి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వశిష్ట ముని తపస్సు చేసిన ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం పొందుకుంటామని భక్తుల నమ్మకం భక్తజన సందోహంతో శివనామ స్మరణ మార్మోగింది.
Read Also..
పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో శివ పూజలు చేస్తే మోక్ష మార్గమని భక్తులు విశేషంగా విశ్వసిస్తారు. అలాగే శివుని ముందు దీపం వెలిగించడం పాప విముక్తి, ఆత్మ మోక్షానికి మార్గమని చెబుతుంటారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు.
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ముగుస్తున్నడంతో తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తినీ, చాటుకున్నారు. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో స్వామివారిని దర్శించు కునేందుకు ఐదు గంటలు పైగా సమయం పట్టింది. అలాగే తమ కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమోక్కు పూజలు చెల్లించుకున్నారు భక్తులు. అటు ప్రసాదం కౌంటర్స్, కళ్యాణకట్ట లో భక్తులతో నిండిపోయాయి…. వాయిస్ : వచ్చిన భక్తుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు అగ్రహo వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందికి తెలిసిన వారిని, లోపలికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల దేవుడు రాజన్న, కనీసం పేదలకు దర్శనం కాకుండ ఆలయ అధికారులు చేసారని మీడియాతో వాపోయారు….