కార్తీక మాసంలో శివ నామ స్మరణకు ఎంతో విశిష్టత ఉంది. కేవలం శివ పంచాక్షరీ మంత్రంతోనే ముక్తిని సాధించవచ్చు అంటారు పురాణ పండితులు, పెద్దలు. అయితే పరమేశ్వరుడు జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ఉండటం అందరికీ తెలిసిందే. అయితే ఈ సోమనాథ ఆలయం ఎక్కడుంది?? దాని విశిష్టత ఏంటి?? ఇక్కడ శివుడు వెలసిన కారణం ఏమిటి?? వంటి విషయాలు తెలుసుకుంటే సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది. దక్ష ప్రజాపతికి అశ్వని, భరణి మొదలయిన ఇరవై ఏడుమంది పుత్రికలు ఉన్నారు. వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్షప్రజాపతి. వీరందరూ నక్షత్రాలు. అయితే చంద్రుడికి తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ ప్రేమ, అనురాగము కలిగి, ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు. ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది. వారంతా ఒక రోజు తండ్రియైన దక్షప్రజాపతి వద్దకు వెళ్లి, చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొర పెట్టుకున్నారు. దక్షప్రజాపతి చంద్రుని పిలిపించి “చంద్రా! నా కుమార్తెలు ఇరవై ఏడుమందిని నీకిచ్చి వివాహం చేశాను. నువ్వు అందరినీ సమంగా చూడాలి కదా!! కాని నువ్వు ఒకరిపై ఎక్కువ అనురాగము, వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు కదా. ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో” అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు. అంతేకాని తన బుద్ధిమాత్రం మార్చుకోలేదు. రోహిణితోనే ఎక్కువకాలం గడుపుతున్నాడు. చంద్రుని తీరు మారకపోయేసరికి మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం చెప్పారు. దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుని క్షయవ్యాధి పీడితుడుగా మారిపొమ్మని శాపం పెట్టాడు. ఆయన శాపం పెట్టగానే చంద్రుడికి క్షయ వ్యాధి సోకింది. రోజురోజుకు కృశించిపోతున్నాడు. ఇంక భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు. విషయం అంతా.. విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో “సారాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది. అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు” అని మంత్రోపదేశం కూడా చేశాడు. ప్రభాస తీర్ధములో చాలా కాలము మృత్యుంజయ మంత్ర జపం చేశాడు చంద్రుడు. చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై ‘నీకే వరం కావాలో కోరుకో’ అన్నాడు. అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి, క్షయ వ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు. దానికి శంకరుడు “చంద్రా! దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు. నవబ్రహ్మలలో ఒకడు. కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు. అలా అని నీ ప్రార్ధన త్రోసి పుచ్చటం న్యాయం కాదు. అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధి గ్రస్తుడవుగా, మరికొంతకాలము సుఖంగా ఉండు. అంటే కృష్ణపక్షములో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి. మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి. ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు. అమావాస్య రోజున కళావిహీనుడివి అవుతావు అన్నాడు. అప్పటి నుంచీ చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడినాయి. ఆ తరువాత చంద్రుని ప్రార్ధన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్ధములో జ్యోతిర్లింగముగా వెలిశాడు. సోముడు అంటే చంద్రుడు. అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాధుడు అని పిలవబడుతున్నాడు. సోమనాధుని అర్చించినవారికి భయంకర రోగములు కూడా పటాపంచలవుతాయి. మానసిక బాధలు తొలగిపోతాయి.
Devotional
వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రమున్నది అంటారు. ఆ క్షేత్రాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ, వింధ్య పర్వతము మీదికి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురువెళ్ళి స్వాగత సత్కారాలందించి. ఉచిత రీతిన గౌరవించాడు. వారి ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు అయిన తరువాత ఇష్టాగోష్టి జరుగుతోంది. ఆ సమయంలో వింధ్యరాజు “నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు. మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారము మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేను గాక ఇంకెవరు ఉంటారు?” అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. నారదుడు తనని మెచ్చుకోకుండా అలా నిట్టూర్పు విడిచేసరికి ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు. మహర్షి నిట్టూర్పుకు కారణము ఏమిటి? పర్వతాలలో సార్వభౌముడు తను కాదా? అని ఈ రకంగా ఆలోచిస్తూ “మహర్షీ నేను అలా అనగానే ఇలా నిట్టూర్పు విడుస్తున్నారు ఎందుకు?? మీరు అలా నిట్టూర్చడం వెనుక అర్థం ఏమిటి?” అన్నాడు. దానికి నారదుడు “వింధ్యరాజా! నువ్వు చెప్పినదంతా నిజమే. నీ దగ్గర సర్వసంపదలు ఉన్నాయి, సమస్త ధాతువులు ఉన్నాయి, బంగారము మొదలుగా గల లోహాలు అన్నీ ఉన్న మాట నిజమే. కాని మేరుపర్వత శిఖరాల గురించి తెలియదా?? ఆ శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. మరి వారందరూ నీదగ్గరకు వస్తున్నారా?? నీకా భాగ్యము లేదు. అందుకే నాకు విచారము. నా నిట్టూర్పుకు కారణం అదే” అన్నాడు. మేరు పర్వతము కన్న గొప్ప అనిపించుకోవాలనే పట్టుదల వింధ్య పర్వతానికి కలిగింది. దానికోసం ఆ పరమేశ్వరుని ఆరాధించటము తప్ప మరే మార్గం లేదు అని నిశ్చయించి తపస్సు చెయ్యటానికి ఓంకార యంత్రము ఒకటి తయారుచేసి, దాని మీద పార్ధివ లింగము స్థాపించి సంకల్పించాడు. ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి. ప్రత్యక్షమై ‘ఏ వరం కావాలో కోరుకో!’ అన్నాడు. “పరమేశ్వరా! చంద్రమౌళీశ్వరా! పాహిమాం తండ్రీ! పాహిమాం! నీ కరుణ లేశమాత్రము ఉన్నప్పటికీ, నీ భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు. నాకు ఇంక కావలసినది ఏమున్నది. అయినప్పటికి నాదొక చిన్న ప్రార్ధన. మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా, దేవతలు విహరించటానికి వీలుగా ఉండటము నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి. అటువంటి నువ్వు, నా శిఖరాన సదా నివసించవలసినదిగా నా ప్రార్ధన” అన్నాడు వింధ్యరాజు. ఆ పలుకులు ఆలకించిన శంకరుడు, భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు.. ఇప్పుడు ఓంకార యంత్రము, పార్థివ లింగము రెండుగా అయిపోయినాయి. ఓంకార యంత్రమందు ఉద్భవించినవాడు కాబట్టి ఓంకారేశ్వరుడు, పార్ధివ లింగమందు ఉద్భవించినవాడు కాబట్టి అమలేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ నర్మదానది కూడా రెండు పాయలుగా చీలిపోయింది. ఆ రెండు పాయల నడుము ఒక శిఖరమున్నది. ఆ శిఖరము మీద సూర్యవంశపు రాజు మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి, విష్ణువురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి. ఇదీ ఓంకారేశ్వరుడి కథ.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది. పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది. గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు. పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పామును పట్టుకొని వెళ్ళాడు. కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుందని, అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు, స్థానికులు చర్చించుకున్నారు.
శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నుండి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు, కొల్లం వరకు ప్రత్యేక రైలును శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ లన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్లలో శ్రీకాకుళం జిల్లాలో వివిధ సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా జిల్లా లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.మొదటిసారి ఎంపీగా ఎన్నికైన అనంతరం పార్లమెంట్ సభలో ఉత్తరాంధ్ర ప్రజలకు కాశి వెళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసానని, ఎన్నోసార్లు అధికారులను, మంత్రులను కలిసి విణతి పత్రం అందించడంతో విశాఖపట్నం నుంచి వారణాసి రైలు ఏర్పాటు చేశారని అన్నారు. శ్రీకాకుళం నుండి కొల్లం వరకు వెళ్లే శబరిమల ప్రత్యేక రైలు అయ్యప్ప భక్తులు మాల ధారణ విరమించే సమయం వరకు నడుస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతి వస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో రాత్రికి బస చేసి నవంబరు 27న శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికేందుకు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం సీఎం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీ పర్యటన నిబంధనలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సూచనలు చేశారు. ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే మార్గం పొడవునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా, తిరుమల పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వెళ్లనున్నారు.
కార్తీకమాసంలో పితృకర్మలు ఎక్కువగా చేస్తారు. అలాంటి పితృదేవతలకు మోక్షాన్ని చేకూర్చే ఆలయం ఆ పరమశివుడి ద్వారా ఎంతో విచిత్రంగా పురుడుపోసుకుంది. శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు , బ్రహ్మ పంచముఖుడు, అంటే ఆయనకు అయిదు ముఖాలు ఉన్నాయి. అయితే నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాని, ఆయన ఊర్ద్వముఖం పార్వతీదేవి అందాన్ని చూస్తూ ఉండిపోయింది. అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చింది, బ్రహ్మకు బుద్ది చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేసాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సామాన్యమైనది కాదు. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు, క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ తప్పు చేశాడు, దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది అయితే అది సరాసరి బ్రహ్మ హత్యా పాతకంగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది. జగత్ప్రభువు, అంతటి తపశ్శాలికి ఆ పాపఫలం తప్పలేదు. దేవతలందరిని పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటొ సూచించమని పరమశివుడు అడిగాడు. అప్పుడు అందరూ “పరమేశ్వరా నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి, శాసించగలిగినవాడివి, అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మాకు తోచింది చెపుతున్నాము. ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి. ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు కొంత కాలానికి ఆ కపాలం నీ చేతి నుండి రాలిపోవచ్చు అని చెప్పారు దేవతలు. పరమశివుడికి ఇది బాగానే ఉందని అనిపించింది. భిక్షువుగా మారి మూడు లోకాలు తిరుగుతూ మళ్ళీ తన పెళ్లి జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నాడు. అందుకు సంతోషించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడివద్దకు వచ్చి “పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా!ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు బహుమతిగా ఇవ్వవా అని అడిగాడట. నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు. పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు, అప్పటినుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు ఆ తరువాత శివుడు ఆయనదగ్గరకే భిక్షకు బయలుదెరాడు. ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు,”పరమ శివుడే నాదగ్గరికి భిక్షకి వస్తున్నాడు. నిజానికి ఇది ఆయన ఇల్లే, తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు. అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట, ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి, ఇది వాస్తవానికి శివక్షేత్రం, ఇందులో నేను( విష్ణువు) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మకపాలంను పట్టుకుని వస్తున్నాడు. చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి. ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికితోడు విష్ణు శక్తి, శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని” భావిస్తు విష్ణువు శివుడికి ఎదురువెళ్లి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు, అంతే ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడిపోయి శిలామయ (రాతి) శివలింగరూపంగా మారిపోయింది. అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది.
Read Also..
25 నవంబర్ 2023 (శనివారం) నాడు వైకుంఠ చతుర్దశి, విశ్వేశ్వర వ్రతం వస్తుంది. ఈ రోజున శివుడు కుంఠం అనే రాక్షసుడిని సంహరించాడని పురాణ కథనం. ఈ రోజున శివుని ఆరాధన చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
వైకుంఠ చతుర్దశి
వైకుంఠ చతుర్దశి రోజున ఉదయం పూట స్నానం చేసి, శివుని దేవాలయానికి వెళ్లాలి. శివునికి పూజలు చేయాలి. శివుడిని అభిషేకం చేయాలి. పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించాలి. శివుని స్తోత్రాలు, మంత్రాలు పఠించాలి. రాత్రి శివుని ముందు భజనలు చేయాలి.
విశ్వేశ్వర వ్రతం
విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించే విధానం:
- ఉదయం పూట స్నానం చేసి, శివుని దేవాలయానికి వెళ్లాలి.
- శివునికి పూజలు చేయాలి.
- శివుడిని అభిషేకం చేయాలి.
- పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించాలి.
- శివుని స్తోత్రాలు, మంత్రాలు పఠించాలి.
- రాత్రి శివుని ముందు భజనలు చేయాలి.
- ఈ వ్రతాన్ని కనీసం ఒక సంవత్సరంపాటు ఆచరించాలి.
వైకుంఠ చతుర్దశి, విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుని అనుగ్రహంతో:
- శత్రు బాధలు తొలగిపోతాయి.
- జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.
- ఆరోగ్యం బాగుంటుంది.
- కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.
- ధనం, ధాన్యం పుష్కలంగా లభిస్తాయి.
ఈ రోజున శివునికి శుభ్రమైన బట్టలు, పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించాలి. శివుని స్తోత్రాలు, మంత్రాలు పఠించడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు.
టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్ కీ 11లక్షల 16రూపాయల విరాళాని ఇచ్చిన తిరుపతికీ చెందిన భక్తుడు మైలు ప్రణీత్,నిహారిక దంపతులు.టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో ధర్మారెడ్డి కి చెక్ ని ప్రణీత్ దంపతులు అందజేశారు. ఈ సందర్బంగా దాతను ఈవో ధర్మారెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దాత తండ్రి మైలు మధు,జ్యోతి పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ధన త్రయోదశి పండుగను ప్రజలు జరుపుకుంటారు. ఈ మాసం విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడిందని చాలా మందికి తెలుసు. అందుకే ఈ మాసంలో తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డబ్బు సమస్యను ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారాలు చేయాలి. మరి ఇందుకోసం ధన త్రయోదశి రోజు తులసికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అందుకే ధన త్రయోదశి రోజు తులసి ఆకుల రసాన్ని తాగడం శుభప్రదంగా భావిస్తారు. ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా మీకు సంపదను కూడా తెచ్చిపెడుతుంది. అలాగే జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది మీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను పెట్టాలి. అలాగే మరిచిపోకుండా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మాత్రమే ఇలా చేయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత రాత్రి కాకముందే తులసి మొక్కను తిరిగి ఇంట్లో పెట్టాలి. దీని వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు తులసి మొక్కకు సంబంధించిన ఈ పనులు చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజు ఇంటికి జమ్మి మొక్కను తీసుకురావడాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు. ఇలా జమ్మి మొక్కను ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.
Read Also..
Read Also..
ఈనెల 26,27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిని సందర్శిస్తున్నారు. 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమాశ్రయానికి చేరుకుంటారు. తిరుమల వెళ్ళి రాత్రి బస చేసి, 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదుకు బయలుదేరి వెళతారు. ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.