“ప్రదక్షిణం”లో ‘ప్ర‘అనే అక్షరము పాపాలకి నాశనము…‘ద‘అనగా కోరికలు తీర్చమని,‘క్షి‘అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ణ‘అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
Devotional
అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు.
శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే బిల్వ వృక్షంనుదేవతలు స్వర్గంలోనూ, మందార పర్వతం పైనా, వైకుంఠంలోనూ నాటారు. శివుని కిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండినా, కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పూవులతో సమానం.
Read Also..
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.
150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇకపోతే… అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది.
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలబడ్డారు. తరతరాలు వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ కర్రల సమరంలో పెద్దఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు. ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో దేవరగట్టు మారుమోగింది. దేవతా మూర్తుల కోసం నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. పలువురు విచక్షణారహితంగా కొట్టుకుకోవడంతో సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఆలూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా, బన్నీ ఉత్సవంలో ప్రమాదం చోటుచేసుకున్నది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు. ప్రమాదవశాత్తూ అది విరిగిపడటంతో గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరికొదరు గాయపడ్డారు.
రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది. పదార్థాలన్నీ అణు నిర్మితాలే. అణువులో పరమాణువులు ఉంటాయి. పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి, దానిలో ధనావేశిత ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న సత్యం. నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులు ఉన్నపుడు, శిలలు జీవంలేనివని ఎలా అనగలం? భగవంతుడు సర్వాంతర్యామిగా అందరూ అంగీకరిస్తారు. కాబట్టి ప్రతిమ యందూ భగవంతుడున్నట్లే. కాగా ఆ దైవత్వ ఉనికిని ప్రతిష్ఠా కలాపం ద్వారా మంత్ర యంత్ర తంత్ర శక్తులచే అందు పూర్ణమూ, స్థిరమూ చేయడం జరుగుతుంది. “మంత్రాధీనంతు దైవతం” కాన అలానే సాధ్యం. నిత్యనైమిత్తిక పూజాదికంచే ఆ కేంద్రీకృత దైవశక్తి క్రమాభివృద్ధితో జనాకర్షకమై భక్తుల కోర్కెలు తీర్చుతూ వారి అజ్ఞానాంధకారం క్రమంగా తొలగిస్తూ ఉంటుంది. భావనాశక్తివలన స్థూలదృష్టికి కన్పడే జడ శిలనుకాక అందలి చైతన్యాన్ని దర్శింపగలం. ఇదంతా శాస్త్రీయ విధానమే తప్ప అశాస్త్రీయం కాదు. “కష్టమ్ శాస్త్రమ్” అన్నట్లు ఈ శాస్త్రీయత గ్రహింపగల్గడం ఒక ప్రత్యేక సంస్కారం. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై బహిర్గతంకాక తన ఉత్పత్తి స్థానమగు ఆత్మయందు విలీనమగు నిర్గుణోపాసనకు సుగుణోపాసన అత్యవసరమగు విషయం, మనస్తత్వ శాస్త్ర విహితం తప్ప అనాలోచిత వ్యవహారం కాదు. కాబట్టి విగ్రహారాధన శాస్త్రీయ సిద్ధాంతము, ఆధ్యాత్మికంలో అత్యావశ్యకము. ఈ సైన్సును నేటి సైంటిస్టులకంటే గొప్ప పరిశోధనల ద్వారానే ప్రాచీనకాలపు సైంటిస్టులైన మన మహర్షులు నిరూపించి తెల్పారు. నిశించుట, విపరీత స్థితులు పొందుట లేని ఉత్తమ శిలను ప్రతిష్ఠామూర్తులకు వినియోగించుట శ్రేష్ఠం. అందుకే శిలా విగ్రహాలే ప్రతిష్ఠిత మవటం చూస్తాం. యంత్రగత మంత్రాధిష్ఠాన దేవతాశక్తిని తనలోకి స్వీకరించే గుణము శిలామూర్తికి ఉంది. అందుకే యంత్రముపై శిలావిగ్రహాలనే అనాదిగా ప్రతిష్ఠించడం జరుగుతోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనం తిరుమాడవీధులో అశ్వ వాహనం పై శ్రీమలయప్పస్వామి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం కల్కి అలంకరణలో కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఇంద్రియ నిగ్రహం వున్న చోటే ఆద్యాత్మిక వికాసం ఇంద్రియాలను జయించిన వారే భగవంతుని చేరుతారు పార్దసారధిగా భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు ఇంద్రియాలనే గుర్రాలను పూన్చిన రధమే మన దేహం ఆ రధాన్ని నడిపించే పరమాత్మే నేడు అశ్వ వాహనుడు అశ్వ వాహనంపై స్వామి తెలుపుతున్నది ఇంద్రియ నిగ్రహం కల్కి అవతారంలో… అశ్వవాహనారూఢుడై స్వామి అశ్వ వాహనంపై తిరుమలలో విహరిస్తున్న శ్రీ వేంకటేశ్వరుడు భక్తులకు కలిదోషాలు లేకుండా చేసేందుకే కల్కి అవతారం తిరుమాఢవీధుల్లో అశ్వముపై దర్శనమిస్తున్న శ్రీనివాసుడు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు
మాజీ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనం ఆనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వివిఎస్.లక్ష్మణ్ విరాళంగా అందించారు.దాదాపు 14 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టిటిడి ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మవారిని పూజిస్తారని, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు… దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
కాశీయాత్ర చేసి వచ్చిన తరువాత కాలభైరవుని రూపంగా వున్న కుక్కకు గారెల దండ వెయ్యాలి. లేకపోతే కాశీయాత్ర ఫలించదని కొందరు పురోహితులు అక్కడక్కడ చెప్తుంటారు. మరి కొందరు కుక్కకు పూజలు కూడా చెయమని పరిహారాల్లో భాగంగా చెపుతారు. అయితే పొరపాటున కుక్క ముట్టుకుంటే స్నానం చేసే ఆనవాయితీ ఉన్న కుటుంబాలు అనేకం వున్నాయి. కానీ ఇలా పూజలు, పరిహారాలు చేయకపోతే కాశీయాత్రాఫలం దక్కదంటు అనేక మంది అంటుటారు. అసలు వాస్తవాలేంటో తెల్సుకుందాం.
కాశీయాత్ర చేసివస్తే కుక్కకు దండ వెయ్యాలని ఏ శాస్త్రంలోనూ లేదు అనేది పెద్దలకి తెల్సినా, అంతగా దీనిని పట్టించుకోటంలేదనేది వాస్తవం. కాలభైరవుడి వాహనం శునకం అనేది శాస్త్ర సమ్మతమే. ఆ శునకం దేవతాస్వరూపమే. కానీ కాలభైరవుడు శునకరూపుడు కాదు…ఇది నిజం. శ్రీమహావిష్ణవు దశావతారాల్లో వరాహరూపం ఒకటని మనందరికీ తెల్సినా.. ఊరిబయట తిరిగే వాటిని మనం ఎన్నడూ దైవసమానంగా చూడలేదు, అంటే యాజ్ఞవరాహానికి, ఊరపందికి పోలికే లేదు. ఊరపందిని వరాహస్వామి అనడం విడ్డూరం, పైగా పాపం కూడా… అలాగే కాశీయా- కుక్కకు గారేల దండా.. పూజలు. సనాతన సంప్రదాయం కుటుంబాలు మంచి ఆనవాయితీని ఇప్పటికీ అనుసరించటం శ్లాఘనీయం.. శాస్త్రబద్ధం. దానిని వదలవద్దు అని పండితులు అంటుంటారు.శాస్త్ర సమ్మతం కానివి ఆచరించవద్దు.
శునకాలు బలిభుక్కులు. కాకులను కూడా ఇలాగే చూస్తాము. పూజానంతరం నివేదిత పదార్థాలు కొద్దిగా తీసి, వేరే పాత్రలో వుంచి, ఇంటి బయట శునకానికి, కాకులకు వేస్తారు…ఇలా చేయటం కొందరికి ఆచారంగా వుంటుంది కూడా. ఇది బలినివేదన. బలి సందర్భంలో ఆ ప్రత్యేక దేవతలకిచ్చిన పదార్థాలను శునకాలకు మాత్రమే ఇస్తారు. అది కూడా వీధిలో – వాటిని తాకకుండానే, అలాగే ఏవో గారెలు లాంటివి కుక్కకి పెడితే తప్పులేదు. అంతేగానీ వాటికి మాలలు వేయడం, కుక్కనే భైరవుడు అనుకోవడం తగదు. అలాగని కుక్కని తక్కువచేసి చూడనక్కర్లేదు. వాటిని చూడవలసిన విధంగా చూడాలి. ఇళ్లల్లో, దేవత మందిరాల్లో కుక్కలు తిరిగితే మంచిది కాదు అని కొన్ని గ్రంధాల్లో చెప్పటం జరిగింది. ఇది శాస్త్ర ప్రమాణం. నేటి ఆదునిక కాలంలో హోదాకోసం, రక్షణకోసం కుక్కలను పెంచుకున్నా వాటికి తగిన విధంగా ఇంటి బయట లేదా వీధి గేటుదగ్గర వుండేట్టు చూసుకోవాలి. మనం తాకకపోయినా, కాపలాగా ఇంటి బయట ఉంటే తప్పులేదు. దానికి ఆహారం పెట్టినా దోషం కాదు. భూత దయ అవసరమే, కానీ దేని మర్యాద దానిదనే సత్యాన్ని మనం విస్మరించరాదు.లేనిపోని ఆచారాలను, కొత్త సంప్రదాయాలను సృష్ఠించే వారు తప్పక శాస్త్రప్రామాణికంగా వున్న వాటినే పరిహారాలు, విధివిధానాలుగా చెప్పాలితప్ప విరుద్దములైన వాటిని ధర్మబద్దమైనవిగా శాస్త్రసమ్మతమైనవిగా చెప్పరాదు.




Total views : 212240