Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిజిటల్ మీడియా సర్వే

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిజిటల్ మీడియా సర్వే

by Satya
revanth reddy

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపు అధికమంది మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుపుతోంది. దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? అనే అంశంపై ఓ డిజిటల్ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆరు లక్షలమంది పాల్గొన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి పేరును సూచించారు. డిజిటల్ మార్గంలో జరిగిన ఈ సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి, 16 శాతం మంది మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడు శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వైపు మొగ్గు చూపారు.

Advertisements

You may also like

Our Visitor

039438
Total views : 196818

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: