కాకినాడ లో డాక్టర్ కిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ గోకులం వెనుక ఉన్న డాక్టర్ తన స్వగృహంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహం ఉంచారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కళ్యాణ్ పేరిట 11 ఎకరాల భూమి విక్రయించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన అచ్చంపేట పెదబాబు పూర్తిగా సోమ్ములు చెల్లించకుండా కొంత మాత్రమే ముట్ట చెప్పి ఇక ఏమి డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. దస్తావేజులు పూర్తిగా స్వాధీనం చేసుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం మధ్యవర్తి పెదబాబు ఇంటికి వెళ్లి సోమ్ములు కోసం ప్రశ్నించగా డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో ఇంటికి వచ్చి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి శేషారత్నం ఆరోపిస్తున్నారు.
Read Also..