Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Film “మే 15న థియేటర్స్‌లోకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ సమ్మర్ మూవీ”..

“మే 15న థియేటర్స్‌లోకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ సమ్మర్ మూవీ”..

by CVR NEWS

ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ట్రైలర్ చెప్పినట్టుగా మార్నింగ్ షో విషయం ఏంటో తెలియదు గానీ, టాక్ బయటకు వస్తే సినిమా గురించి మీకే తెలుస్తుంది. చాలా మంచి టీమ్‌తో కలిసి నిజాయితీగా చేసిన సినిమా ఇది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అనీష్ కురువిల్లా గారు, సుదర్శన్ గారు, వైవా హర్ష ఇలా చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా కెమెరామెన్ రవి గారు సినిమాను చాలా బ్యూటిఫుల్‌గా తీశారు. చాలా మంచి విజువల్స్ ఉంటాయి. అరుణ్ ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాను విడుదల చేస్తున్న బుచ్చి గారికి, రాందాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. మొన్ననే ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ రాందాస్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందులో చిన్న సినిమా అంటే ఇంకా రిస్క్ ఉంటుంది. అయితే ఈ సినిమా మాత్రం చాలా నచ్చింది. ప్రొడక్ట్ చాలా క్వాలిటీతో తీశారు. మోదీజీ గారు కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహించారు. ఆయన మాట ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. డైరెక్టర్ మధు ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇది యూత్ సినిమా, సమ్మర్ సినిమా. ఈ సినిమాలో శివాజీ రాజా గారు, అనీష్ కురువిల్లా గారు, సుదర్శన్, వైవా హర్ష ఇలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. యువత అందరూ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం. మే 15న అందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

అనీష్ కురువిల్లా మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సొసైటీకి కావాల్సిన విలువైన మెసేజ్ కూడా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అరవింద్, మధు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ సమ్మర్ ఫిలిం. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టోరీ టెల్లింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమా చూసి చాలా రోజులవుతుంది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు.

గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఇది అగ్రికల్చర్‌కు సంబంధించిన సబ్జెక్ట్. తన కన్నీటితో ఈ పంట పండించాడు. ఇలాంటి మంచి సినిమా తీయడానికి చాలా సంఘర్షణ పడ్డారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేసి టీమ్ అందరికీ ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఫీల్‌గుడ్ మూవీ. ఇది 100 శాతం ఎంటర్‌టైనర్. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ గారు కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఇష్టమయ్యే సినిమా చేశాం. ఫస్ట్ డే ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే పదిమందికి చెప్పండి. అప్పుడే ఇలాంటి మంచి కథలు వస్తాయి. డైరెక్టర్ మధుదీప్ చాలా ఓర్పుతో ఈ సినిమా చేశారు. రాందాస్ గారు మాకు మార్గదర్శకులుగా చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఆయన సాయాన్ని మర్చిపోలేము.

డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. జీవితంలో ఏం చేసినా పెద్దవాళ్లను గౌరవించాలని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు. ఆయన ఎందుకు ఆ మాట చెప్పారో ఈరోజు నాకు అర్థమైంది. మా నాన్న చెప్పిన మాట ఈరోజు నిజమైంది. రాందాస్ గారు లేకపోతే ఈ సినిమా బయటకు వచ్చి ఇంతమందిని అలరించేది కాదు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇది సమ్మర్ సినిమా. అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం. ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా మీ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 15న మీరందరూ థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

బాబ్జీ మాట్లాడుతూ.. ఇది సమ్మర్ మూవీ. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. మే 15న థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని చెప్పారు. మా సినిమా కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ టైటిల్‌తో వస్తోంది. ఇది మా అదృష్టం. కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012615
Total views : 75919

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.