తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో
చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’:
ఈనెల 18న విడుదల
……………………
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, “ఇదీ సంగతి” ‘ఆటగదరా శివా’ తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ . సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ, ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది.నా స్నేహితుడైన మదన్ తో ఈ కథను సినిమా గా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా. నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ వుంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ వుంటారు. అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టాను.
ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది.ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం వుంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.
హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: మదన్, సంగీతం: జే రెక్స్, పాటలు: చంద్ర సిద్ధార్థ్, మాటలు: పులగం చిన్నారాయణ, ఆర్ట్: అంజి కొయ్యల, సినిమాటోగ్రఫీ: సామ్ సుప్రీత్ , ఎడిటింగ్: బొబ్బిలి భానుప్రకాశ్, గిరిధర్,
సహ నిర్మాతలు: అగస్త్య మంజు, సాగర్, మహి, సమర్పణ: వై.వి.సత్యనారాయణ రాజు, నిర్మాత – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్.
Film
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం.
అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
కథ నచ్చడం తో ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచడానికి సుముఖంగా ఉన్నారు , ఇది సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువల (రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్) తో భారీ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరించారు.
ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ: “మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చూసిన రషెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి, చిత్ర బృందం మొత్తం ఔట్పుట్ పట్ల ఎంతో నమ్మకంతో ఉంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘లీసా’ తెరకెక్కింది. ఇది ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది.
సినిమా మేకింగ్, అనన్య నాగళ్ల అద్భుతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ నెలలో సినిమాను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.
నటీనటులు: అనన్య నాగళ్ల, అల్లాల రవిరెడ్డి గారు, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు.
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా “చకోర- లూనార్ లవ్ బర్డ్”. ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. “చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది.
ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా “చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన రామ్మోహన్ నాయుడు చిత్ర దర్శక నిర్మాతలకు, ఇతర బృందానికి తన బెస్ట్ విశెస్ అందించారు.
“చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – అందమైన వైజాగ్ నేపథ్యంలో సాగే సరికొత్త ప్రేమ కథతో ఈ సినిమా రూపొందినట్లు టీజర్ తో తెలుస్తోంది. ‘ఇది మామూలు ప్రేమ కథ కాదు, అమ్మ చెప్పిన ప్రేమ కథ, అమ్మ చెప్పిన ప్రేమ కథే కాదు అబ్బాయి ప్రేమ కథ, అబ్బాయి ప్రేమ కథే కాదు అమ్మాయి ప్రేమ కథ కూడా , ఇది మామూలు ప్రేమ కాదు. ఇది చకోర ప్రేమ కథ అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. జాబిల్లి చేరేందుకు ప్రయత్నించే చకోర పక్షిని సింబాలిక్ గా చెబుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. తన ప్రేయసి జూలీ ఎక్కడుందో వెతికేందుకు హీరో తీవ్ర ప్రయత్నాలు చేయడం టీజర్ లో చూపించారు. హీరో తన జూలీని చేరుకున్నాడా లేదా అనే క్యూరియాసిటీని టీజర్ క్రియేట్ చేసింది.
చకోర పక్షి ఒక యూనిక్ బర్డ్.. తన దాహాన్ని తీర్చుకునే ప్రాసెస్ లో స్వచ్ఛమైన వాన చినుకులనే త్రాగుతుంది తప్ప ఏది బడితే అది త్రాగదు… ఆ వర్షపు చినుకుల కోసం అప్పటివరకూ నిరీక్షిస్తూ ఉంటుంది… ఈ కథలో హీరో కూడా అంత స్వచ్ఛమైన ప్రేమికుడు అని చెప్పడానికి ఈ చిత్రానికి చకోర టైటిల్ పెట్టారు.
జాబిలిని చేరుకునే ప్రయత్నంలో చకోర పక్షి మరణిస్తుంది కానీ ఆ ప్రయత్నం ఆపదు…
మరి తన ప్రేయసి జాబిలిని చేరుకునే ప్రయత్నంలో హీరో మరణించాడా లేదా తన అంతులేని ప్రేమతో మరణాన్నే జయించాడా అన్నదే కథ.
లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిజం…వంటి అన్ని అంశాలు చూపిస్తూ కట్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఘనంగా ప్రారంభమైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త చిత్రం “ఇ.ఎం.ఐ”
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిర్మాణ సంస్థ 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త చిత్రం “ఇ.ఎం.ఐ”
నూతన నటీనటులు, టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఎమోషన్ తో కూడిన ఎంటర్ టైనర్ గా రాబోతున్న మూవీ
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చిన హీరో ఆది సాయికుమార్, కెమెరా స్విచ్ఛాన్ చేసిన డైరెక్టర్ సాయి మార్తాండ్, స్క్రిప్ట్ అందజేసిన డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ కాంబోలో మరో భారీ చిత్రాన్ని నిర్మించబోతున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ
ఇకపై వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ రోజు పూజా కార్యక్రమాలతో “ఇ.ఎం.ఐ” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.
బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్ తో నిర్మించి భారీ స్థాయిలో పబ్లిసిటీకి కూడా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇకపై మంచి కాన్సెప్ట్స్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేందుకు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ప్లాన్స్ చేస్తోంది.
‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్.
‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది : చిత్ర దర్శకుడు యుద్ధనపూడి మైకిల్
‘మా రాముడు అందరివాడు ’ చిత్ర విజయంపై నమ్మకంగా ఉన్నాం : నిర్మాత, విలన్ లక్ష్మణరావు
అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు.
నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్. సుమన్ గారు ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డివోపీ వినోద్, కుమార్ సహా టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 4న ప్రేక్షకులముందుకు రాబోతున్న మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.
దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు పద్నాలుగు నెలలు ఈ సినిమాతో జర్నీ చేశాం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అవన్నీ దాటుకుని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. శ్రీరామ్ గారు నా స్నేహితుడు. ఆయన సపోర్ట్‌తోనే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. హీరోయిన్ స్వాతి కూడా చాలా బాగా సహకరించారు. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఆమె మాకు సహకరించారు. ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటు కథ, మాటలు, పాటలు, రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించాను. కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం. కానీ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కష్టపడితే ప్రతి ఒక్కరికీ సక్సెస్ వస్తుందని నిరూపించాం. ఇది నాకు సక్సెస్‌మీట్‌లా ఫీలవుతున్నా. పాజిటివ్ వైబ్ ఉండే టైటిల్, పాజిటివ్ వైబ్ ఉన్న కథ ఇది. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందిస్తాం. సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా”అని చెప్పారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘‘చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని కాకుండా కంటెంట్ చూడాలి. తెలుగు వాళ్లం మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటేనే మనం ప్రూవ్ చేసుకుంటాం. ఈ సినిమాలో చాలా దమ్ము ఉంది. ఇప్పటికీ నేను పదమూడు సినిమాలు చేశా. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. సుమన్ గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వంద సినిమాలు చేయాలనేది నా టార్గెట్”అని అన్నారు.
హీరోయిన్ స్వాతి మందాడి మాట్లాడుతూ..‘‘సుమన్ గారి లాంటి సీనియర్ నటుడితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఈ చిత్రంలో నా పాత్ర అందరికీ నచ్చుతుంది”అని చెప్పారు.
నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణ, జబర్దస్త్ ఆర్టిస్టులు అప్పారావు, వినోద్, సహా మూవీ టీమ్ అంతా పాల్గొని ఈ వేడుకలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్ఆర్డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో
హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్లో వివరించారు. కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్‌కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ .. ‘‘వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి, ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. ‘‘ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్. మాకోసం వచ్చిన నాగబాబు గారు, సాయి రాజేష్ గారు, మెహర్ రమేష్ గారు, వీఎన్ ఆదిత్య గారు, ఎస్కేఎన్ గారికి థాంక్స్. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని అన్నారు.
సాత్విక మాట్లాడుతూ .. ‘‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ సినిమా నా కెరీర్లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న మిస్సింగ్ మేఘన సినిమా లోని 2వ సాంగ్ ను లాంచ్ చేశారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు…అలాగే లిరిక్స్ , మ్యూజిక్ బాగున్నాయి.. సినిమా కూడా హిట్ అవుతుంది అని అభినందించారు దిల్ రాజు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా … తరువాత సినిమా నుంచి ఫస్ట్”సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. అలాగే 2 వ పాట ను నిర్మాత దిల్ రాజు గారు రిలీజ్ చేశారు…శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాలు ఇచ్చి..పెద్ద ..పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో 2nd లిరికల్ రిలీజ్ చేయడం హ్యాపీ ఉంది.
మేము రిలీజ్ చేసిన సాంగ్ కు , టీజర్ కు ఆడియన్స్ నుండి ..మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుండి మంచి అప్లాజ్ వస్తుంది… సినిమా విషయానికి వస్తే మంచి ఎమోషనల్ థ్రిల్లర్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా చేయడం జరిగింది.
మా సాంగ్స్, టీజర్ ఎంత బాగున్నాయో..సినిమా అంత కంటే బాగుంటుంది అని తెలియజేశారు..
*సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ మాట్లాడుతూ : నేను సంగీతం అందించిన మిస్సింగ్ మేఘన లోని సాంగ్ ను దిల్ రాజు లాంచ్ చేయడం చాలా ..చాలా హ్యాపీగా ఉంది..రాజు గారికి మ్యూజిక్ లో మంచి టెస్ట్ ఉంది .అందుకే ఆయన సినిమాలోని పాటలు చాట్ బస్టర్స్ అవుతున్నాయి… అటువంటి రాజు గారు మా పాట విని చాలా బాగుంది అనడం ..మాకు మంచి బూస్ట్ నిచ్చింది.నేనే స్వరపరచి , సంగీతం అందించిన ఈ పాటను దిల్ రాజు గారు లాంచ్ చేయడం నాకు బాగా స్పెషల్.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ : ఎంతో మంది కి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది…ఆయన హార్ట్ ఫుల్ గా పాట బాగుంది.. సినిమా కూడా హిట్ అవ్వాలి అని బ్లెస్ చేశారు…ఆయన అన్నట్టే సినిమా కూడా వచ్చింది..అలాగే ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను…
క్యాస్ట్ : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు.ఆయనతో పాటు మరో నిర్మాత సి. కళ్యాణ్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోతున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.దిల్ రాజు సారథ్యంలోని యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్.. బండ్ల గణేష్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర ప్రసాద్, జీవితా రాజశేఖర్, భరత్ చౌదరి నామినేషన్లు వేశారు.నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 28 వరకు గడువు ఉంది.
సెప్టెంబర్ 6న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో మద్దతు పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో బండ్ల గణేష్, సి. కళ్యాణ్‌లలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు. స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సాయి సురేష్ చాలా నేచురల్‌గా ఆర్ట్ వర్క్ చేశారు. తను చాలా జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలాగే మా డీఓపీ విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు. తను చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తాడు. అలాగే దినేష్ సీలేరులో అన్నీ చాలా అద్భుతంగా చూసుకున్నారు. బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్, అలాగే మా డైరెక్టర్ శివ ఈ సినిమాకి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ గారు, రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సతీష్‌తో ఇంకా చాలా సినిమాలు చేయాలి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్లు పడుతున్న ఆనందం మాటల్లో చెప్పలేను. వాళ్లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోవిడ్ తమిళ్ మలయాళ సినిమాలు ఎక్కువగా చూశాం. అవన్నీ రూటెడ్‌గా ఉండేవి. అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. ‘ఇరుముడి’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు మళ్లీ ‘ఇరుముడి’ సినిమా చూడడానికి థియేటర్‌కి రావడం కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ ఆనందం మామూలుది కాదు. నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చేశాను. డైరెక్టర్ త్రినాథ్ పాత్ర, ‘ఇరుముడి’ అనే టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మా శీను ఈ సినిమా విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మొదటి నుంచి ‘సూపర్‌హిట్ సినిమా సార్’ అని చెబుతూనే ఉండేవాడు. తన నమ్మకం నిజమైంది. ఇంత మంచి సినిమా చేసినందుకు మా డైరెక్టర్ థాంక్యూ. తనది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇంత పెద్ద విజయం వచ్చినా సరే చాలా నార్మల్‌గా ఉంటాడు. ప్రియా భవాని శంకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ పండడానికి తను సెకండ్ హాఫ్‌లో చేసిన ఆ రెండు సీన్స్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి. అలాగే బేబీ నక్షత్ర అద్భుతంగా చేసింది. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.డైరెక్షన్ టీమ్‌కి, ప్రొడక్షన్ టీమ్‌కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మాటలకు అందని రియాక్షన్ ఇది. ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఆ రియాక్షన్లో అర్థమైంది. ‘ఇరుముడి’ సినిమా ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ సినిమాలో చిన్న పని చేసిన వారు కూడా ఈ సినిమాకు పనిచేశామని గొప్పగా చెప్పుకునే ఆనందాన్ని ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌కి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ‘ఇరుముడి’ సినిమాకు డిస్ట్రిబ్యూషన్స్ నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలను ఆడియన్స్ తమ ఇళ్లల్లోకి తీసుకున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ నన్ను గుండెల్లోకి తీసుకున్నారు. ఈ సినిమా విజయం నాకు మరింత బాధ్యతను పెంచింది. రవితేజ గారు సినిమా కోసం ఏం కావాలో అవన్నీ చేశారు. ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రతే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం. ఈ సినిమా ప్రయాణంలో శ్రీనివాసరాజు చాలా సపోర్ట్ చేశారు. రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు. మొన్న సినిమా చూసి కూడా అదే ఎమోషన్‌తో మాట్లాడారు. సాయికుమార్ గారు కథ చెప్పిన తర్వాత నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా ఓన్ చేసుకుని సినిమా చేశారు. డీఓపీ విష్ణు, డైరెక్టర్ సాయిసురేష్ నేచురల్ వర్క్ ఇచ్చారు. అనంత శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి చక్కగా లిరిక్స్ రాశారు. నవీన్ గారు, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి చేసిన ‘ఖుషి’ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది. కాకపోతే ఆ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని మేము ఊహించుకున్నాం. ఇరుముడి అలాంటి పెద్ద విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. ప్రియా భవాని శంకర్ గారు కావేరి పాత్రని చాలా రియలిస్టిక్‌గా చేశారు. నక్షత్ర చాలా ధైర్యం గల పాప. తను మణెమ్మ పాత్రలో ఎంతలా జీవించిందో ఆడియన్స్ రియాక్షన్స్ చెప్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ కథ వినగానే పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని చెప్పారు. కల్ట్ క్లాసిక్ మూవీ అవుతుందని ట్వీట్ చేస్తానన్నారు. కానీ నేనే వద్దని చెప్పాను. ఆ రోజు ఆయన రాసుకున్న ట్వీట్‌ను ఈరోజు నాకు చూపించారు. మా సినిమా మీద ఆయనకు అంత నమ్మకం ఉంచారు. సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే స్వసికకు టీచర్ పాత్ర చెప్పగానే, ఎలాంటి అనుమానాలు లేకుండా పాత్ర చాలా బాగుందని, ఒక నటిగా నేను నిరూపించుకుంటానని చెప్పి చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో స్టూడెంట్స్‌గా చేసిన మిగతా ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రవితేజగారు నాకు అన్నయ్యతో సమానం అయిన మీడియా కూడా ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ పెద్ద సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నేను ఈ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేక్షకులు అందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. విష్ణు గారు, సాయి సురేష్ గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ కూడా చాలా చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీడియాకు, సోషల్ మీడియాకు, ప్రేక్షకులకు అందరికీ థాంక్యూ. డైరెక్టర్ శివ నిర్వాణ ఒక క్లాసిక్ సినిమా తీశారు. తను ఈ సినిమా దర్శకుడిగా చాలా కాలం గుర్తుండిపోతారు. ఈ సినిమాను మించిన సినిమా ఆయన మళ్లీ తీయాలని కోరుకుంటున్నాను. కావేరి లాంటి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. విజయాన్ని అందుకున్న మా నిర్మాతలకు కంగ్రాజులేషన్స్. రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. రవితేజ గారితో కలిసి చేసిన ఈ సినిమా ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్యూ.
బేబీ నక్షత్ర మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు. మణెమ్మగా నన్ను అభిమానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, నిర్మాతలకు, మా హీరో రవితేజ గారికి థాంక్యూ.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ముందుగా ఇది మనందరి సినిమాగా ముందుకు తీసుకెళ్లిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా చూసిన అందరూ ఇస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మేము ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీశాం గానీ, ఇంత ఎమోషనల్ అయిన సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా చూసి వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నా, చదువుతున్నా కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. ఈ సినిమా అంతా ప్రభావితం చేసింది. అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే, రవితేజ గారు మొత్తం మా టీమ్ అందరికీ పెద్ద హిట్ ఇచ్చారు. ఇదంతా ఒక చైన్ రియాక్షన్‌లాగా జరిగింది. సినిమా రోజురోజుకీ పెరుగుతోంది. మా డైరెక్టర్ శివ ఒక మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది. చాలా పెద్ద నెంబర్స్ కనిపిస్తాయని భావిస్తున్నాం. అందరికీ థాంక్యూ.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. సినిమా విడుదలైనప్పటి నుంచి అభినందనలు, కలెక్షన్స్ రిపోర్ట్స్ నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాను ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. రవితేజ గారికి ఈ సినిమా చూడగానే కాల్ చేసి చెప్పాను. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్. ఇలాంటి క్యారెక్టర్ రవితేజ గారే చేయగలరు. ఈరోజు ఆడియన్స్ రియాక్షన్ కూడా అలానే ఉంది. అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాబై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాను మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రభంజనం మరో నాలుగు వారాలపాటు కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
సాయికుమార్ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమా మా అందరికీ గొప్ప ఎమోషన్. మైత్రి మూవీ మేకర్స్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. మొదట సీలేరులో ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి, మంచి కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టడం జరిగింది. మంచి మనసుల కలయిక ఈ ‘ఇరుముడి’. ‘ఇరుముడి’ కారణంగా సీలేరు పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారింది. నా 50 ఏళ్ల ప్రస్థానంలో ‘ఇరుముడి’ లాంటి సినిమా చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రవితేజ అంటే మా ఫ్యామిలీ. . మైసూర్లో ఈ సినిమా చూశాను. అక్కడ కూడా థియేటర్ అంతా హౌస్‌ఫుల్‌గా ఉంది. నాగార్జున గారి షూటింగ్‌కి మైసూర్ వెళ్లాను. నాగార్జున గారు కూడా రవితేజకు కంగ్రాట్స్ చెప్పారు. ఇందులో అందరూ కూడా అద్భుతంగా నటించారు. ఈ సక్సెస్‌కు కారణమైన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. శివ నిర్వాణ గారు ఈ కథ మొదలైనప్పటి నుంచి అలాగే ముగింపుకు కావలసిన పాటలను నాతో రాయించే గొప్ప బాధ్యతను నా మీద పెట్టారు. ఈ సినిమా నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టం. రవితేజ గారు ఇలాంటి విజయాలు మళ్లీ మళ్లీ అందుకోగలరు. మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు, టెక్నీషియన్లు అందరినీ కూడా తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు. అందుకే వారికి వరుసగా విజయాలు వస్తున్నాయి. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
స్వసిక మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమాకి పాన్ ఇండియా నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి, డైరెక్టర్ శివ నిర్వాణ గారికి, మా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డీఓపీ విష్ణు శర్మ మాట్లాడుతూ.. ‘మజిలీ’ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ గారితో ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే నేను తెలుగు సినిమాకు వచ్చినప్పటి నుంచి మైత్రి మూవీ మేకర్స్‌లో పనిచేయాలని కోరిక. ఈ సినిమాతో అది తీరింది. రవితేజ గారికి ఎందుకు అంత క్రేజ్ ఉందో ఆయనతో పని చేసిన తర్వాత తెలిసింది. ఆయన డెడికేషన్ అద్భుతం. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. చివరి 30 నిమిషాలు కంటతడి పెట్టుకున్నామని చెప్తున్నారు. మేము ఆ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాం. సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ గారు నా వర్క్ చూసి పర్సనల్‌గా పిలిచి మాట్లాడారు – సంగీత దర్శకుడు అజయ్ అరసాడ.
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్‌లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు.
చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి?
చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు.
మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా?
అన్ని రకాల జానర్లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. తమిళ్ నుంచి వస్తే కొత్తగా ఇస్తాడు, మలయాళం నుంచి వస్తే ఫ్రెష్‌గా ఇస్తారని ఇక్కడ కొంత మంది నమ్ముతారు.
బడ్జెట్‌ను పట్టి మ్యూజిక్ మారుతుందా?
ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్‌గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్ స్టార్టింగ్‌లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే ఓ నిర్మాత వద్దని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ).
థియేటర్ కోసం పని చేసినప్పుడు, ఓటీటీ కోసం పని చేసినప్పుడు ఉండే తేడా, మీకు కలిగే ఫీలింగ్ ఏంటి?
మేం థియేటర్‌కి సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. దాన్ని చివరకు ఓటీటీలోకి తీసుకు వస్తారు. అప్పటి వరకు మేం పడిన కష్టం వృథా అవుతుంది. ‘వికటకవి’ని ఒకవేళ థియేటర్లో చూస్తే సౌండింగ్ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఓటీటీకి వచ్చే సరికి నేను చేసిన యాభై శాతానికి పడిపోతుంది.
మ్యూజిక్ మీద ఏఐ ప్రభావం ఎంత వరకు ఉంటుంది?
మ్యూజిక్ మీద ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఏఐలో ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా కూడా ఒకేలా ఉంటాయి. కొంత మంది నిర్మాతలు ఏఐ నుంచి ట్రాక్స్ పంపి.. ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేం ఎందుకు మీరే కొట్టుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది (నవ్వుతూ). ఏఐని వాడి ఏ టెక్నీషియన్ అయినా పని చేయొచ్చు. కానీ ఏఐని వాడి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వొచ్చని మాత్రం అనుకోకూడదు (నవ్వుతూ).
రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏం మాట్లాడారు?
నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తాను. మొన్న మోదీ గారిని ఆయన కలిసినప్పుడు ఓ స్కోర్ చేశాను. నా వర్క్ చూసి ఆయన పిలిపించారు. ఆయనతో నాతో పర్సనల్‌గా మాట్లాడారు. పొలిటికల్‌గా అయినా సరే పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసమైనా సరే పని చేద్దామని ఆయన అన్నారు.
జన సేన కోసం ఎప్పటి నుంచి పని చేశారు? ఆ అవకాశం ఎలా వచ్చింది?
వెంకట్ చిక్కాల అనే నా మిత్రుడు అక్కడ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. అలా నా ఫ్రెండ్ వల్ల ఆ అవకాశం వచ్చింది. బన్నీ వాస్ గారు కూడా నాతో చాలా వర్క్ చేయించారు. అక్కడి నుంచే నాకు ‘ఆయ్’ అవకాశం వచ్చింది.
మీరు బయట ఎక్కడా ఎందుకు కనిపించరు?
నాకు బయటకు వచ్చి నా పనితనం గురించి నేనే చెప్పుకోవడం నాకు నచ్చదు. నేను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడను. ఈవెంట్లలో కనిపించను. సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవడం అన్నది నాకు తెలియదు.
పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని చెప్పిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి?
నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నా. కానీ మళ్లీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఓ ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నా. కానీ నేను వెళ్లే సరికి ఆయన ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట మాట్లాడారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి ఆయన చెప్పారు.
మీ దగ్గర ఉన్న ఓ వస్తువు గురించి ఆయన అడిగారని తెలిసింది?
నా దగ్గర కాఫీ మగ్ షేప్‌లో ఉండే ఓ బోస్ స్పీకర్ ఉంటుంది. ఇదేంటి ఆయన అడిగారు. దాన్ని పట్టుకుని సరదాగా చూసుకుంటూ నవ్వారు. ఇదేంటి కాఫీ కప్పులా ఉందని కామెడీ చేశారు. కాఫీ పట్టుకొచ్చావా? అని జోక్స్ వేశారు. ఈయనేంటి? నాతో జోక్స్ వేస్తున్నారు అని అనుకుని లోలోపల సంబరపడిపోయాను.
ఇప్పుడున్న దర్శకులతో పని చేయడం ఎలా అనిపిస్తుంది?
ఒకప్పుడు దర్శకులు సిట్యువేషన్ గానీ, కాన్సెప్ట్ గానీ చెప్పి ట్యూన్ కావాలని అనేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా మందికి అది తెలియడం లేదు. సీన్స్ గురించి చెప్తారు. కానీ సీన్లో ఏం చెప్పాలని అనుకుంటారు.. దాని కాన్సెప్ట్ ఏంటి? ఎలాంటి పాట కావాలని చెప్పలేకపోతోన్నారు.. సినిమా కాన్సెప్ట్‌ని కూడా మాకు సరిగ్గా వివరించలేక పోతోన్నారు. కాన్సెప్ట్ చెప్తే గానీ ఓ లిరిసిస్ట్ సాహిత్యాన్ని రాయలేడు, నేను ట్యూన్ ఇవ్వలేను.
మ్యూజిక్ విషయంలో క్రెడిట్స్ మిస్ అవ్వడం, వేరే వాళ్లకి క్రెడిట్స్ వెళ్లడంపై మీ అభిప్రాయం ఏంటి?
‘ఆయ్’ విషయంలో నాకు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది. రామ్ మిర్యాల గారు కూడా రెండు పాటలు ఇచ్చారు. మిగతాది అంతా నేను చేశాను. కానీ పేరు మాత్రం ఆయనదే కనిపించేది. మీడియాలో అలా తప్పుగా వెళ్లింది. అందుకే ప్రతీ ఈవెంట్లో బన్నీ వాస్ గారు నా పేరుని చెబుతూ ఉండేవారు. మీడియాలో కొన్ని చోట్ల అలా వచ్చిన దాన్ని బన్నీ వాస్ గారు కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. రీసెంట్గా ‘సేవ్ ది టైగర్స్’ టైంలో నా పేరు కాకుండా ఎవరి పేరో కనిపించింది. నేను మాత్రం నా టీంలో ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ ఇస్తాను.
పదేళ్ల జర్నీపై మీరు సంతృప్తిగా ఉన్నారా?
పేరుకి పదేళ్లు అయినా మధ్యలో చాలా టైంని కరోనా తినేసింది. నా ఈ జర్నీలో నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ఎలాంటి సినిమాకి అయినా మ్యూజిక్ ఇవ్వగలను. పెద్ద కమర్షియల్ మూవీకి కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగలను. ఈ పదేళ్లలో నేను ఈ కాన్ఫిడెన్స్‌ను సంపాదించుకున్నాను. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.