సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఘన విజయం సాధించింది. అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించింది. అయితే, ఈ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది. తాను రచించిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు సైతం కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని… అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని శరత్ చంద్ర చెప్పారు. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
Film
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈవెంట్లో..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తూనే ఉన్నాం. అనురాధ ప్రొడక్షన్స్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఆ టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించాను. వారితో నాకు పెద్దగా పరిచయం ఉండేది కాదు. దసరా సినిమాను వాళ్లు కొన్నారని తెలిసి వారిని కలవడం జరిగింది. ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం. శ్రీనివాస గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫైనాన్షియల్‌గా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు. నాకు మిగిలిన ఈ టైంలో, ఆ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తాను. లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుంది. ఈ సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది. లక్ష్ కష్టానికి, టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘నేను ఇన్నేళ్లలో ఏ హీరోని కూడా డేట్స్ అడగలేదు. ఎంతో మంది దర్శకులని నేను పరిచయం చేశాను. ధీర సినిమాతో డైరెక్టర్ విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. దర్శకుడు పడ్డ కష్టాన్ని నేను చూశాను. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. తండ్రిగా నేను లక్ష్‌ను చూసి గర్విస్తుంటాను. ఇంతకు మించిన ఆనందం నాకు ఇక రాదు. ఫిబ్రవరి 2న ధీర చిత్రం రాబోతోంది. మార్చిలో నేను వంద కోట్లతో తీసిన రికార్డ్ బ్రేక్ అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది. నేనే ఆ సినిమాను ఐదేళ్ల నుంచి తీస్తున్నా. అది ప్యాన్ వరల్డ్ సినిమా. సునిల్ కుమార్ రెడ్డి గారి కాంబోలో హిందీలోనూ ఓ సినిమాను చేస్తున్నాను. కే ఎస్ నాగేశ్వరరావు తీసిన నా కనురెప్పవు నువ్వేరా కూడా రెడీగా ఉంది. మా ప్రొడక్షన్స్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి. దిల్ రాజు గారు ఛాంబర్ అధ్యక్షుడిగా చేయడంలో నా వంతు సాయం చేశాను. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీని ఒకత్రాటిపైకి తీసుకు రావాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ దిల్ రాజు గారు మాత్రం ఏకత్రాటి మీదకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఫిల్మ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా సాయం చేస్తామని అన్నారు. మున్ముందు చిత్ర పరిశ్రమ మరింత ఎత్తుకు వెళ్తుంది. ఇంకా మంచి మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
లక్ష్ చదలవాడ మాట్లాడుతూ.. ‘సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేం. నా కారెక్టరైజేషన్ గురించి మాట్లాడతాను. సినిమాలోని పాత్ర, రియల్ లైఫ్‌లోని కారెక్టర్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా నచ్చింది చేస్తుంటాడు. అలాంటి వాడికి ఓ మిషన్ ఇస్తే.. ఆ ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు ధీరలో చూపించబోతోన్నాం. నా లుక్ బాగుంది. నన్ను బాగా చూపించారు. నెపోటిజం, బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకి చాలా కష్టం. మా మీద అంచనాలుంటాయి. బయటకు వెళ్తే అవకాశాలు రావు. మీ నాన్న గారు ఉన్నారు కదా? అని అంటారు. నేను కూడా ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. మాక్కూడా అవకాశాలు రావడం కష్టమే. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారు. హీరోగా, నిర్మాతగా నా వంతు ప్రయాణం చేస్తున్నాను. ఫిబ్రవరి 2న మా సినిమా రాబోతోంది. మేం ఎంత చేసినా ఆడియెన్స్‌కు నచ్చకపోతే వృథా. మీకు సినిమా నచ్చితే.. ఇంకా కష్టపడి సినిమాలు చేస్తాం. మేం నిజాయితీగా ఈ సినిమాను తీశాం. మా నాన్న గారు లేకపోతే నేను లేను. ఆయన వన్ మెన్ ఆర్మీ. ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశారు. కానీ ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉంటారు. ఆయనతో మాట్లాడాలంటే ఇప్పటికీ నాకు భయమే. థాంక్స్ డాడీ.. మీ వల్లే మేం ఉన్నాం. ఎస్టీటీ ఫిల్మ్స్ ఎప్పుడూ కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. అనిల్ హ్యాపీ ఎండింగ్, ధీరజ్ అంబాజీపేట, సోహెల్ బూట్ కట్ బాలరాజు ఇలా అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ గారి బ్యానర్లో వచ్చిన పోలీస్ సినిమాకు నేను అసిస్టెంట్‌గా పని చేశాను. లక్ష్ నాకు థియేటర్ ఫ్రెండ్. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షోకు వస్తాడు. మిడ్ నైట్ షోలు కూడా చూస్తాం. లక్ష్‌కు సినిమాలంటే ప్రాణం. నీ కటౌట్‌ను సరిగ్గా వాడుకున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. సాయి కార్తీక్ ఆర్ఆర్ బాగుంది. లక్ష్ ప్యాషన్, కష్టపడే తత్త్వానికి తగ్గ ప్రతిఫలం రావాలి’ అని అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘చదలవాడ శ్రీనివాసరావు గారిని ఇలా చూడటం ఆనందంగా ఉంది. ఆయన కొడుకు లక్ష్ సినిమా ఈవెంట్‌కు నన్ను పిలిచినందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ శ్రీను నాకు ఐదేళ్ల క్రితం ఈ కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు విజువల్స్ ఊహించుకున్నా. ట్రైలర్ చూస్తే అద్భుతంగా ఉంది. అప్పుడు చెప్పిన విజువల్స్ ఇప్పుడు నాకు కనిపించాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. లక్ష్ కటౌట్ బాగుంది. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. టీం అందరికీ బ్రేక్ రావాలి. నిర్మాతకు మంచి లాభాలు రావాలి’ అని కోరుకున్నారు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీలోకి రావడానికి నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు స్పూర్తి.. నేను ఈ స్టేజ్ మీదకు రావడినికి చదలవాడ శ్రీనివాసరావు గారి మానవత్వం కారణం. చదలవాడ శ్రీనివాసరావు గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆయనకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. ఆ సెంటిమెంట్లే ఈ సినిమాను హిట్ చేయాలి. నేను కూడా ఓ రెండు సెంటిమెంట్లు ఈ సినిమా గురించి చెబుతాను. ఒకే ఒక్కడు సినిమాలో మగధీర.. మగధీర అనే పాట ఉంటుంది. మగధీర సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కేజీయఫ్ సినిమాలో ధీర.. ధీర.. అనే పాట ఉంది. ఇప్పుడు ధీర సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. డ్రైవర్ రాముడు ఫిబ్రవరి 2న విడుదలైంది.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. శంకరాభరణం కూడా ఫిబ్రవరి 2నే విడుదలైంది. ఫస్ట్ సినిమా హిట్టైతే దర్శకుడి కెరీర్ బాగుంటుంది. విక్రాంత్ శ్రీనివాస్‌కు పెద్ద సక్సెస్ రావాలి. లక్ష్ త్వరలోనే పెద్ద స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. కటౌట్, కంటెంట్ ఉన్న హీరో లక్ష్. ఆయన కథలపై మంచి జడ్జ్మెంట్ ఉంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘చదలవాడు శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుండాలని, అంతా ఒక్కత్రాటిపై నడవాలని కోరుకుంటున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఆయన సపోర్ట్ చేసిన వాళ్లే గెలిచారు. చిన్న చిత్రాల కోసం అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ధీర డైరెక్టర్ చాలా ఏళ్ల నుంచి రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. డైరెక్టర్ విక్రాంత్ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. లక్ష్ చాలా ప్యాషన్ ఉన్న హీరో. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అన్నారు.
ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనా టైంలో చదలవాడ శ్రీనివాసరావు గారు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. అడిగినోళ్లకి, అడగనోళ్లకి కూడా సాయం చేస్తుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన బిడ్డ లక్ష్. అతనికి సినిమాలంటే ప్యాషన్. ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టంతోనే సక్సెస్ వస్తుందని నమ్ముతుంటారు. బిచ్చగాడు సినిమాను తెలుగులోకి రిలీజ్ కావడానికి లక్ష్ కారణం. ఈ సినిమాలో ఫైట్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ధీర చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలి’ అని అన్నారు.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారిపై ఎలాంటి అంచనాలుండవు. కానీ లక్ష్ లాంటి వారికి బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత విజయ రామరాజు మాట్లాడుతూ.. ‘చదలవాడ శ్రీనివాసరావు ఎంతో గొప్ప వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని వెళ్లి సాయం చేస్తుంటారు. ఆయన మంచితనం వల్ల సక్సెస్ ఆయన వెంటనే ఉంటుంది. లక్ష్ ఎంతో కష్టపడుతున్నాడు. కటౌట్, యాక్టింగ్, డబ్బు ఇలా అన్నీ లక్ష్‌కు ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
మాతృదేవోభవ డైరెక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘లక్ష్ని అందరూ పొగుడుతుంటే నాకు ఆనందంగా ఉంది. ఏడేళ్ల ఉన్నప్పుడే నటన నేర్పించా. లక్ష్ మొదటి సినిమా నీతో వస్తాకు నేనే దర్శకుడ్ని. లక్ష్ కష్టం గురించి చెబుతుంటే ఆనందంగా ఉంది. ట్రైలర్ చూస్తే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయనిపిస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 2న థియేటర్లో చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
సిల్లీ మాంక్స్ అనిల్ మాట్లాడుతూ.. ‘లక్ష్‌తో నాకు గ్యాంగ్‌స్టర్ గంగరాజు నుంచి పరిచయం ఏర్పడింది. లక్ష్ కేవలం హీరో కాదు.. నిర్మాతగా, సీఈవోగానూ బాధ్యతలు చూసుకుంటారు. వలయం నుంచి ధీర వరకు లక్ష్లో చాలా మార్పులు వచ్చాయి. మున్ముందు ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి’ అని అన్నారు.
డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు రాసుకున్న కథ, కన్న కలలను నిర్మాత నెరవేరుస్తుంటారు. ఇంత పెద్ద బ్యానర్ నుంచి దర్శకుడిగా పరిచయం అవుతానని అనుకోలేదు. ఘోస్ట్‌గా రాసిన సినిమాలు హిట్టయ్యాయి. కానీ పేరు రాలేదు. ఆ తరువాత ధీర కథను రాసుకున్నాను. రాముడికి, కృష్ణుడికి కొన్ని లక్షణాలుంటాయి. రావణాసురుడికి కొన్ని లక్షణాలుంటాయి. ధీర సినిమాలోని హీరో పాత్ర కూడా గ్రే షేడ్స్‌లోనే ఉంటుంది. ఇది చాలా యూనిక్ పాయింట్. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ కథను రాసుకున్నాను. ఫస్ట్ సినిమానే తేడా కొడితే దర్శకుడి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. లక్ష్ నాకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా నిలిచారు. కెమెరా వర్క్, మ్యూజిక్ అంతా బాగా వచ్చింది. ఈ చిత్రం 80 శాతం నైట్ ఎఫెక్ట్‌లో ఉంటుంది. ఫిబ్రవరి 2న రాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాలి. సినిమా పరిశ్రమ బాగుంటేనే మేం అంతా బాగుంటామ’ని అన్నారు.
కర్త కర్మ క్రియ డైరెక్టర్ నాగు గౌర మాట్లాడుతూ.. ‘నాలాంటి అప్ కమింగ్ డైరెక్టర్లతో చదలవాడ శ్రీనివాసరావు గారు సినిమాలు చేస్తుంటారు. లక్ష్ గారు సినిమా చేయాలనుంటే భారీ బడ్జెట్ చిత్రాలనే చేయగలరు. కానీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తున్నారు. నటుడిగా, మాస్ హీరోగా నిరూపించుకున్నారు. ధీర చిత్రంతో స్టార్ హీరోగా మారిపోతారు’ అని అన్నారు.
సింగరేణి కార్మికుల బిడ్డగా తనను సినిమాలలో ఆదరించాలని బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ విజ్ఞప్తి చేశారు. తాను నటించి నిర్మించిన బూట్ కట్ బాలరాజు ప్రమోషన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన పర్యటించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో బాణాసంచా కాల్చి సినిమా విశేషాలను వివరించారు. తాను సింగరేణి కార్మికుని బిడ్డగా బిగ్ బాస్ ద్వారా సుపరిచితుడిని అయ్యానని, తన తండ్రి పదవీ విరమణ ద్వారా వచ్చిన డబ్బుతో ఈ సినిమా నిర్మించినట్టు తెలిపారు. సింగరేణి కార్మికుని బిడ్డగా తనను ఈ ప్రాంతవాసులు ఆదరించాలని కోరారు. ఫిబ్రవరి 2న విడుదలయ్యే ఈ చిత్రాన్ని సింగరేణి ప్రాంతం లోని తన అభిమానులు భారీ వసూలు రాబట్టాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి గరుడ సర్కిల్ లో తమిళ తెలుగు చిత్ర షూటింగ్ వివాదానికి కారణమైంది, ఉదయం 7 నుంచి 10 గంటల సమయం మధ్యలో మైత్రి మూవీస్ మేకర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ సంబంధించి గరుడ విగ్రహం ఎదురుగా యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించారు. అయితే అదే సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులకు పూర్తిగా ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు ఇటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు గంటపాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనితోపాటు ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ నుంచి చిత్రీకరిస్తున్న యూనిట్ సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తున్న వారిపై దాడులకు సైతం పాల్పడ్డారు. ముఖ్యంగా గరుడా విగ్రహం ఎదుట యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. మరోవైపు పోలీసులు పవిత్రమైన గరుడ సర్కిల్లో ఏవిధంగా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గరుడ సర్కిల్ వద్ద నిరసన తెలియజేయడానికి కూడా అనుమతించిన పోలీసులు అధికారులు ఇప్పుడు షూటింగ్ కి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచేశారు. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
పీపుల్స్ మీడియా అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ‘మంచి కంటెంట్‌తో రామ్ చిత్రం రాబోతోంది. ఎన్నో ఆర్థిక కష్టాలను పడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను కొంత రషెస్ చూశాను. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమానే అయినా సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. మన సైనికులు, ప్రాణ త్యాగాల మీద చిత్రాలు వస్తుంటాయి. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్. వారి త్యాగాలను చూపించి అందరికీ మరోసారి వారి గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశారు. సాయి కుమార్, ధన్యా బాలకృష్ణ పాత్రలు బాగున్నాయి. మొదటి చిత్రం కావడంతో సూర్య తనకు తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డారు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించారు. దేశ భక్తిని చాటే చిత్రంగా జనవరి 26న రాబోతోంది. ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ.. ‘మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. మా అమ్మానాన్నలు ఎవరో ప్రేక్షకులకు తెలియదు. ఒక హిట్ ఇస్తే ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుంది. అందుకే ఈ సినిమాను తీశాం. ఈ చిత్రానికి నలుగురు పిల్లర్స్‌గా నిలిచారు. నేను, డైరెక్టర్, కెమెరామెన్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్. నా స్నేహితులందరూ కలిసి ఫండింగ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది ఉండదు. మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడింది. ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోంది. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. వందలో అరవై మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మిహిరామ్ గారికి థాంక్స్. భానుచందర్, సాయి కుమార్ గారికి థాంక్స్. ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుంది. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమా బాగుంటే.. బాగుందని లేకపోతే బాగా లేదని చెప్పండి’ అని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే చిత్రంలో నటించాను. మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ను ఎంచుకుని సూర్య చాలా కష్టపడ్డాడు. హీరో సూర్య, దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి ఎంతో కష్టపడి సినిమాను తీశారు. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. ఫైట్స్ అన్నీ బాగుంటాయి. డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమాను మా వంతుగా చేశాం. ఇక నిర్ణయం ప్రజలదే. కంటెంట్ బాగుంటే.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే సినిమాను ఆపలేరు. ఇప్పుడు అంతటా హనుమాన్ ఆడుతోంది. ఇప్పుడు ఈ రామ్ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
దర్శకుడు మిహిరాం మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సపోర్ట్‌గా నిలిచిన వివేక్ కూచిభొట్ల గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత దీపికాంజలికి థాంక్స్. సినిమాలో నటించిన, పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ధారన్ సుక్రి మంచి కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో ఎదుగుతారు. రాజ్ కుమార్ మాస్టర్ ఫైట్స్ బాగుంటాయి. దేశ భక్తిని చాటే చెప్పే చిత్రమే కానీ.. బార్డర్లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. ఓ సైనికుడు చనిపోతే దక్కే గౌరవం వాళ్లకి దక్కదు. అలాంటి అన్ సంగ్ హీరోల గురించి చూపించాను. మాకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. కానీ మంచి థియేటర్లను తెచ్చుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ గణేష్ ప్రయత్నిస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించాలి. మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ.. ‘మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్లో రూ. 5లు డిఫెన్స్‌కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని అన్నారు.
ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. వారి రాకతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. సాయి కుమార్ గారితో నటించడంతో లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది. సూర్య, దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. మా చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.
తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కథతో పాటు మెసెజ్ ఇస్తూ తెరకెక్కిన చిత్రం ‘బీఫోర్ మ్యారేజ్’. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్.
భరత్ – నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు… రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు… ఈ సందర్భంగా చిత్రయూనిట్ సభ్యులు హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది ‘హనుమాన్’ చిత్రం కొనసాగించిన ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాటలు బాగున్నాయి. మంచి విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు విష్ చేస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిథి నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. మ్యూజికల్ హిట్‌గానూ నిలుస్తుందని చెప్పవచ్చు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాలను ఆదరించాలి. చిత్రయూనిట్‌కు బెస్టాఫ్ లక్.
దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటు.. లైఫ్‌లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విషయాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ విషయంలో నిర్మాత సహకరించారు. సినిమా హిట్టవుతుందన్న నమ్మకం ఉంది.
నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్టవుతుంది. యువతీయువకులకు మంచి మెసెజ్ ఇందులో ఉంటుంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాము.
హీరో భరత్ మాట్లాడుతూ… మంచి కథ ఇది. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఈ తరం యువతకు బాగా ఎక్కే సినిమా ఇది. సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
హీరోయిన్ నవీన రెడ్డి మాట్లాడుతూ… నేను తెలుగుమ్మాయిని. ఒక సాధారణ అమ్మాయి లైఫ్‌లో జరిగే పరిస్థితులే ఈ సినిమా. టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాము. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
నటి అపూర్వ మాట్లాడుతూ… మంచి యూత్ ఫుల్ మూవీ. మళ్లీ మళ్లీ చూసేలా సినిమా ఉంది. యువత కచ్చితంగా సినిమాను చూసి హిట్ చేయాలి.
నటీనటులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ…
గాయనీగాయకులు: మంగ్లీ, సంథిల్య పిసపాటి, అపర్ణ నందన్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికుమార్ గొల్లపల్లి,
మ్యూజిక్: పీఆర్
డీవోపీ: రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల
నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
ఎడిటింగ్ అలోష్యాస్ క్సవెర్
పబ్లిసిటీ డిజైనర్: జేకే ఫ్రేమ్స్
పీఆర్ఓ: ఆశోక్ దయ్యాల
Read Also..
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిమేర-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి, మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాందిచుకున్న నిర్మాత, పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టైటిల్ లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో పాటు, ఓ కాలేజీలో జరిగిన వేడుకలో అక్కడి విద్యార్థులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అభినవ్ గోమఠం లోని కొత్త కోణాన్ని, నటుడిలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ పతిష్ట రోజే మా సినిమా లోగోను ఆవిష్కరించడం ఎంతో లక్కీగా భావిస్తున్నాం. అన్నిభావోద్వేగాల మేళవింపుతో లవ్, కామెడీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఫిబ్రవరి ద్వితియార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. తరుణ్‌భాస్కర్, అలీ రేజా, మొయిన్, చక్రపాణి ఆనంద్, నిళగల్ రవి, జ్యోతి రెడ్డి, లావణ్య రెడ్డి, శ్వేత అవస్థి, రవీందర్ రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, సాయిక్రిష్ణ, ఫణి చంద్రశేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ స్వయంభూ, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఆర్ట్: శరవణన్ వసంత్, కథ: అన్వర్ సాథిక్, డైలాగ్స్: రాధామోహన్ గుంటి, సంగీతం: సంజీవ్ టి, నేపథ్య సంగీతం: శ్యాముల్ అబే, ఎడిటర్ రవితేజ గిరిజాల.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ గాయని సునీత, ప్రముఖ యాంకర్ సుమ కనకాల…రోషన్ కనకాలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి.
ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మనదేశం’ చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధినేత విశ్వనాథ్ ను ఈ సందర్భంగా సత్కరించారు.
ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఛైర్మన్ జనార్థన్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం రోజున జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు వస్తారు వెళ్తారు, కానీ ప్రజలకు సేవ చేసిన వారే చిరకాలం గుర్తుంటారు. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. 40 ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఊహించి ముందే చెప్పిన గొప్ప దూరదృష్టి గల నాయకుడు ఆయన. నటుడిగా ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు అన్నారు.
నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ – తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్ వేసిన ముద్ర చెరగనిది. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్ గా, దర్శకుడిగా తెలుగు సినిమా అభివృద్ధికి బాటలు వేశారు. ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆ తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ 75 సంవత్సరాల వేడుక చేయడం సముచితంగా ఉంది. అన్నారు.
నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ – ఎన్టీఆర్ మన మధ్య లేకున్నా, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇవాళ ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, వజ్రాన్ని కూడా సానపట్టాలి. అలా ‘మనదేశం’ సినిమాలో అవకాశం ఇచ్చి ఎన్టీఆర్ ను నటుడిగా మెరుగులు దిద్దింది ఎల్వీ ప్రసాద్, కృష్ణవేణి అమ్మగారని వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని చెప్పారు.
శ్రీమతి కృష్ణవేణి గారు మాట్లాడుతూ ఇంతమంది పెద్దల సమక్షంలో మేము నిర్మించిన ‘మనదేశం’ చిత్రం 75 సంవత్సరాల వేడుక జరగటం, ఆ సినిమా ద్వారా రామారావుగారిని మేము పరిచయం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ – ఇవాళ ‘మనదేశం’ సినిమా స్వర్ణోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ 28వ వర్థంతి కార్యక్రమం జరపడం, ఈ సందర్భంగా మాకు సత్కారం చేయడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్వీ ప్రసాద్ గారు ఎంతో కష్టపడి పరిశ్రమలో ఎదిగారు. ఆయన కృషి వల్లే మేము ఇవాళ సినిమా రంగంలో ఒక భాగంగా కొనసాగడమే కాదు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్స్ తో పేద ప్రజలకు సేవ చేయగలుగుతున్నాం. ఎన్టీఆర్ తో నాన్న గారికి మంచి అనుబంధం ఉండేదని, ఎన్టీఆర్ ను మనమంతా నిత్యం స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు.
పూర్ణా పిక్చర్స్ విశ్వనాధ్ గారు మాట్లాడుతూ – రామారావుగారు నటించిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమాను తాము ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేశామని, ఆ తరువాత వారు నటించిన 30కి పైగా సినిమాలు తామై పంపిణీ చేశామని, రామారావుగారి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
నిర్మాతల మండలి తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ – రామారావు లాంటి మరో నటుడు, నాయకుడు పుట్టరని ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు.
ఎన్.టి.ఆర్. స్మారక నాణాన్ని ముద్రించటం తమ అదృష్టమని, ఆ నాణాన్ని ఇప్పటికే 25 వేలకు పైగా అమ్మామని, ఇది దేశంలోనే రికార్డ్ అని హైదరాబాద్ మింట్ శ్రీనివాస్ తెలిపారు. ఎన్.టి.ఆర్. కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ కమిటీ సభ్యుడు భగీరథ సమన్వయం చేయగా దొప్పలపూడి రామమోహనరావు, అట్లూరి నారాయణరావు, విక్రమ్ పూల, మండవ సతీష్, శ్రీపతి సతీష్ అతిథులను పుష్పగుచ్చాలతో సత్కరించారు.
జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసినదిగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన రెండు వేల మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముమ్మరంగా శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ఆహ్వాన పత్రాలను ఆయా ప్రముఖులకు స్వయంగా అందజేసే బాధ్యతను విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శశిధర్ రావినూతల బృందానికి అప్పగించగా వారు ఆహ్వాన పత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అన్నవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను ” అన్నారు.
విశ్వహిందూ పరిషత్ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి మాట్లాడుతూ ” తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి ఆహ్వానాన్ని మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి వారి స్వగృహానికి వెళ్లి, state guests గా హాజరు కావాలని కోరాము. ఈ సందర్భంగా ఆయన ఆదరంగా రిసీవ్ చేసుకోవటమే కాకుండా ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు అందుకు జరిగిన సుదీర్ఘ న్యాయ పోరాట వివరాలను కూడా చెప్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. స్వయంగా ఆహ్వానం అందిస్తూ చిరంజీవి గారితో మేము గడిపిన అరగంట సమయం మాకొక ఉద్విగ్న భరిత అనుభవంగా నిలిచిపోతుంది” అన్నారు.
ఇదిలా ఉండగా ఆ రోజు రామ్ చరణ్ ఊరిలో లేని కారణంగా నిన్న ముంబై నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జాతీయ నాయకులు సునీల్ అంబేకర్, రామ్ చరణ్ ఉపాసన దంపతులను రామ విగ్రహ స్థాపన లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డు అందజేయడం జరిగింది. రాంచరణ్ కూడా ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరవుతారు.