Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News ఐలాపూర్ భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉంది ..

ఐలాపూర్ భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉంది ..

by CVR NEWS

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం తండాలో కానీ, గ్రామంలోని నివాస గృహాల జోలికి కానీ వెళ్లకుండా చర్యలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. కేవలం అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, ఖాళీ స్థలాల స్వాధీనంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. 1998 నుంచి ‘స్టేటస్ కో కొనసాగించాలని కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, వాటిని ఖాతరు చేయకుండా ముఖిమ్ నిర్మించిన గెస్ట్ హౌస్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే అతని సోదరుడు అజీమ్ ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు తొలగిస్తున్నారు. ఐలాపూర్ గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి. మిగిలి ఉన్న 860 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ భూమి విలువ సుమారు రూ.15 వేల కోట్ల పైమాటే ఉందని అంచనావేస్తున్నారు. కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. హైడ్రా చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ వల్ల వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: