Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshChittoor టిటిడి నియామకాల్లో రాయలసీమకు అన్యాయం..

టిటిడి నియామకాల్లో రాయలసీమకు అన్యాయం..

by Rama
purushotam reddy

టిటిడి ఉద్యోగ నియామకాల్లో రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు.
టిటిడి అధికారులు జోనల్ విధానాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని దీనివల్ల రాయలసీమ యువతకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు పురుషోత్తం రెడ్డి. మాజీ దేశ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 371/డి ఆర్టికల్ ప్రకారం టీటీడీలో ఉద్యోగాలను రాయలసీమ జిల్లా వాసులకు కేటాయించాలనీ, గతంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ గర్జన పేరుతో అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు దీనిపై వెంటనే స్పందించాలని, టిటిడి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే సవరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Our Visitor

025432
Total views : 147274

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.