రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని మీడియాకు సూచన చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని, అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు జీవితాల్లోకి వెళ్లి అనవరస రాద్దాంతం చేయద్దని జడ్జీలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా సూచించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లు ప్రస్తావించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన వార్తల విషయంలో మీడియా సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశింది. దీంతో ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేసు తదుపరి విచారణను హైకోర్టు జులై 23కు వాయిదా వేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి