Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక దందా…!

గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక దందా…!

by Satya
గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక దందా…!

కందుకూరు మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వాగులు,కుంటలు,గుట్టలు అక్రమార్కుల పాలు అవుతున్నాయి .వాగులల్లో ఉన్న మట్టిని,అసైన్డ్ మెంట్,లావాణి పట్టా భూములలో ఉన్న మట్టిని అక్రమార్కులు రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా పాతాళంలోకి గుంతలు తొవ్వుతున్నారు. అక్రమార్కులు ప్రాంతాలలో ప్రకృతి సహజ సిద్ధంగా మట్టితో ఇసుక తయారీ చేసి లక్షలు దండుకుంటున్నారు. అక్రమార్కుల తీరు చూస్తుంటే తోవ్వుకో అమ్ముకో అడిగేవారు లేరు అన్నట్టు ఉంది. నిర్మానుష్య ప్రాంతాలలో ఇసుక ఫిల్టర్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా మట్టిని జల్లెడ పట్టి ఇసుకను తయారు చేస్తున్నారు.
దీనికి నిదర్శనం కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 111లో(ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వాగు ప్రక్కన) గుట్టుచప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక దందా…!మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా నడుస్తుంది.అటువైపు రెవిన్యూ,ఇరిగేషన్,పోలీస్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మట్టి త్రవ్వకాలు జరిపి ఫిల్టర్ ఇసుక తయారీ చేస్తున్నారు.
వాల్టా చట్టానికి తూట్లు పెడుతున్నారు.రెవిన్యూ,ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్ర మత్తులో మునిగిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.
    దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
  • అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
    అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
  • ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.
    ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్‌గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్‌లో…
  • విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.
    ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
  • హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు.
    రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్‌హెచ్-48పై నర్సింగ్‌పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039074
Total views : 194191

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: