234
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణ బీరూట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు జరిపింది. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 10 బాలిస్టిక్ క్షిపణుల్లో చాలా వరకు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.దాడుల అనంతరం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. భవిష్యత్తులో ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ప్రకటించాయి. మరోవైపు ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.