ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్.. రెండు దేశాలూ తక్షణమే యుద్ధం ఆపాలని, కాల్పుల విరమణ పాటించాలని కోరాడు. ఇప్పటికే శాంతి చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి ముగిసిపోయే అవకాశం ఉందని, అతిత్వరలోనే ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు చేసుకోవడం ఆపి, చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ సూచించాడు. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గించడానికి తాను ప్రయత్నిస్తున్నానని, అయితే, ఉద్రిక్తతలు తగ్గకపోతే మళ్లీ సైనిక చర్య తప్పకపోవచ్చని ట్రంప్ అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించినట్లు ట్రంప్ చెప్పారు. చర్చలు సజావుగా సాగడానికి, శాంతి ఒప్పందం కుదరడానికి నెతన్యాహును ఒప్పించినట్లు ట్రంప్ వెల్లడించారు. చర్చలు తుది దశలో ఉన్నాయని, బుధవారం లోపు శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్.
266
previous post