Thursday, June 25, 2026
News Navigation
Thursday, June 25, 2026
News Navigation

Breaking

Thursday, June 25, 2026
Home International ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూప్రకంపనలు..

ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూప్రకంపనలు..

by CVR NEWS

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో అధికారులు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు. తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాల్లో ఒకటి. సాధారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1,500 వరకు భూకంపాలు సంభవిస్తాయి. తాజాగా సంభవించిన భూకంపం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్‌లోని సన్రికు ప్రాంతంలో సంభవించిందని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

031650
Total views : 167156

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.