Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.

నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.

by CVR NEWS
నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మూడు కీలక పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.మనుబోలు మండలం మడమనూరు వద్ద 3,678 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడనున్నాయి.అదేవిధంగా దుత్తలూరు మండలం పాపంపల్లిలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రక్షణ రంగానికి చెందిన మందుగుండు సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది.కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్‌లో వాయేనా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విండ్ టర్బైన్ తయారీ పరిశ్రమను స్థాపించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ మూడు భారీ పరిశ్రమల ఏర్పాటుతో నెల్లూరు జిల్లా పారిశ్రామిక రంగంలో మరింత ముందడుగు వేయనుండగా, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: