ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యల విషయంలో తన అధికారాలను పరిమితం చేస్తూ అమెరికా సెనేట్ ఆమోదించిన ‘వార్ పవర్స్’ తీర్మానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించిన ట్రంప్.. ఈ తీర్మానాన్ని అర్థరహితమైనదిగా అభివర్ణిస్తూ, దీనికి మద్దతుగా ఓటేసిన నలుగురు రిపబ్లికన్ సెనేటర్లపై విమర్శలు గుప్పించారు.ఇరాన్‌ను పూర్తిగా బలహీనపరిచి అమెరికా మాట వినే స్థితికి తీసుకొచ్చామని, దశాబ్దాల తర్వాత మొదటిసారి ఇరాన్ అమెరికాను, అమెరికా అధ్యక్షుడిని గౌరవిస్తున్న సమయంలో సెనేట్ ఈ ఓటింగ్ నిర్వహించడం సరికాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదానికి మద్దతుదారుగా తాము భావించే ఇరాన్‌కు ఈ తీర్మానం పరోక్షంగా మేలు చేసిందని ఆరోపించారు.
ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన నలుగురు రిపబ్లికన్ సెనేటర్లను ట్రంప్ ‘లూజర్లు’గా అభివర్ణించారు. ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలపడం వల్ల అంతర్జాతీయంగా తన చర్చల సామర్థ్యాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో ఇరాన్‌తో శాంతి చర్చలు ముగింపు దశకు వస్తున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
ఇరాన్ అంశంపై సెనేట్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం.
178
previous post