121
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కీలక సమావేశాలకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఇరుపక్షాల మధ్య చర్చలకు అనుకూల వాతావరణం కల్పించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ శాంతి చర్చల్లో పాకిస్థాన్, ఖతార్ దేశాల ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరించనున్నారు.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ జరుగుతున్న ఈ చర్చలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.