115
రష్యాలోని ఉరల్ ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. అయితే ప్రధాన శుద్ధి కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఉరల్స్ గవర్నర్ అలెగ్జాండర్ మూర్ తెలిపారు.ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. తమ దేశం అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ డ్రోన్లు దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ప్రయాణించగలవని వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉరల్స్ ప్రాంతంలోని పలు విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.