Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.

by CVR NEWS
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం

మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ కు చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన -యూబీటీలో చీలికపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. పార్టీలో చేరికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే మాట్లాడుతూ.
ఆరు పులులు ఇప్పుడు అసలైన శివసేన ఫ్యామిలీలోకి వచ్చాయి. వారికి స్వాగతం. ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతమైంది అని ప్రకటించారు.

శిండే క్యాంప్‌లో చేరిన ఎంపీల్లో ఓం రాజే నింబాల్కర్, సంజయ్ దిన పాటిల్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, బౌసాహెబ్ వక్చౌరే ఉన్నారు. మొత్తం 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే క్యాంప్‌లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం 2022 జూన్‌ 22న 40 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చారన్న శిండే.. ఇప్పుడు ఏకంగా ‘సిక్స్‌’ కొట్టామని పేర్కొన్నారు. శివసేన రెండో విడత విస్తరణ ప్రణాళికగా ఈ చేరికను అభివర్ణించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: