Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే శాస్త్రీయ, పర్యావరణ నష్టాలపై రైతులకు అవగాహన …

పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే శాస్త్రీయ, పర్యావరణ నష్టాలపై రైతులకు అవగాహన …

by CVR NEWS
పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే శాస్త్రీయ, పర్యావరణ నష్టాలపై రైతులకు అవగాహన

రాష్ట్రంలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంట వ్యర్థాలను కాల్చడం అనేది కేవలం రైతులకే సంబంధించిన విషయం కాదని, ఇది సమాజం మొత్తం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు మరియు గ్రామస్థాయి స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి పంట అవశేషాలను కాల్చకుండా కలియదున్నే పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బన పదార్థం, ఉపయోగకర సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని, తద్వారా పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ, కంటి, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల పంట వ్యర్థాలను కాల్చే సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదాల్లో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ప్రస్తావిస్తూ రైతులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018819
Total views : 89480

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.