Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు…

కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు…

by Prakash
Kavita filed another writ petition in the Supreme Court

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని… చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా… రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని… ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.