ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. దొడ్డిపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మండల సర్వేయర్ పైన ఒత్తిడి తెచ్చారు. సర్వేయర్ రెడ్డప్ప ఈ భూమి కోర్టులో ఉన్నందువల్ల సర్టిఫికెట్ ఇవ్వలేనన్నారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ కార్యాలయానికి వచ్చి నాయకులు కంభం అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. దీంతో సర్వేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 51 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. అయితే చంద్రబాబుకు మద్దతుగా వివిధ వర్గాల వారు రోడ్డెక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచే ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు, బిల్డింగ్స్ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు. బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఇటు మెట్రో రైల్లో కూడా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా బ్లాక్ డ్రెస్‌లతో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఐటీ ఉద్యోగులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ సభను ఏర్పాటు చేశారు. సాయంత్ర 4గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ సభ జరగనుంది. సభకు సంబంధిచి అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. దాదాపు లక్ష మందిపైగా ఈ సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఐటీలో తాము చేస్తున్న ఉద్యోగాలు నాడు చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడం వల్లే వచ్చాయని టెక్కీలు తెలిపారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.
ఇజ్రాయెల్‌తో ‘తక్షణ ఖైదీల మార్పిడి’కి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత యాహ్యా సిన్వార్ ప్రకటించారు. ఈ మేరకు ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధమని తెలిపారు. మరోవైపు రష్యా అభ్యర్థన మేరకు రష్యా-ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఇద్దరు బంధీలు ఎక్కడ ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నామని మరో ప్రకటనలో హమాస్ వెల్లడించింది. వారిద్దరిని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా హమాస్‌తో రష్యాకు సత్సంబంధాలు ఉన్నాయి. దానిని ఉగ్రవాద సంస్థగా పరిగణించడం లేదు. బంధీల విడుదలకు రష్యా దౌత్యవేత్తలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. మరోవైపు. గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ విరుచుకుపడ్డారు. సైనిక దాడులను ఆయన తప్పుబట్టారు. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ స్పందించింది. టర్కీలోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిచింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను పున:పరిశీలించే వరకు అక్కడి దౌత్య ప్రతినిధులు అందరూ వెనక్కి వచ్చేయాలంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ ‘ఎక్స్’లో పోస్ ద్వారా ప్రకటించారు.
కళ్లలో రక్తస్రావం కలిగిస్తోన్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్’ అని వైద్యనిపుణులు తెలిపారు. ఇది ఒక రకం పురుగుల ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. బాధితుల్లో కండరాల నొప్పి, గొంతులో మంట, వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముక్కు, కళ్లు, చర్మంలోని రక్తనాళాలు పగిలి, వాటి నుంచి రక్తస్రావం జరుగుతుండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. జ్వరం, కళ్లు తిరగడం, మెడ, వెన్ను,తలనొప్పి, కళ్లు ఎర్రబారడం, వెలుగును చూడలేకపోవడం వంటిని కనిపిస్తున్నాయి. వ్యాధి ముదిరేకొద్ది ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యులు అప్రమత్తం చేశారు. కాగా ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తగా ఉండాలని పౌరులను ఫ్రాన్స్ హెచ్చరించింది. కాగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వ్యాధి ఎబోలా వైరస్‌కు సంబంధించినదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుందని తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలి ప్రాధాన్య వ్యాధుల్లో దీనిని కూడా చేర్చుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. కర్ణాటకలో తమ పరిస్థితి ఎలా ఉందనేది చూసేందుకు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతులే తెలంగాణకు వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక రైతులను గాలికి వదిలేసి తెలంగాణలో ఓట్ల వేటకు వచ్చిన డీకే శివకుమార్ ను రెండు రాష్ట్రాల రైతులు క్షమించరని కేటీఆర్ చెప్పారు. ఐదు హామీలంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా గద్దెనెక్కిన తర్వాత కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. అన్న భాగ్య స్కీమ్ అటకెక్కిందని, గృహజ్యోతి పథకం ఆరిపోయిందని ఆరోపించారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదని కేటీఆర్ స్పష్టం చేశారు. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పాన్ని, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థ పాలనకు మధ్య తేడాను తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గంజి మైదానంలో బహిరంగ సభసభకు హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు రానున్నారు. బహిరంగ సభకు హెలికాప్టర్ లో సంగారెడ్డి కి చేరుకోనున్న మల్లికార్జున ఖర్గే. 2000 మందితో బైక్ ర్యాలీ, ప్రతి మండలానికి 5 వేల చొప్పున కార్యకర్తల సమీకరణ ఉంటుందని, ఖర్గే గారి మీటింగ్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుండి కోదాడ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వెళ్లనున్నారు. 1:40 నిమిషాలకి కోదాడకు కేసీఆర్ చేరుకోనున్నారు. 1:50 నిమిషాలకి ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంకు చేరుకొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2.30 నిమిషాలకు కోదాడ నుండి తుంగతుర్తి వెళ్లనునారు. 3:10 నిమిషాలకు తుంగతుర్తి చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 3:50 నిమిషాలకి ఆలేరు నియోజక వర్గ ప్రజా ఆశీర్వాదా సభకు బయల్దేరి వెళ్లనున్నారు. 4:10 నిమిషాలకు ఆలేరు చేరుకొని, 4:20 నిమిషాలకు ఆలేరు నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆలేరు సభ అనంతరం తిరిగి హైదరాబాద్ కి తిరిగి వెళ్లనున్నారు.
మలయాళ నటుడు, మాజీ ఎంపీ సురేశ్ గోపీ ఓ మహిళా జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేశ్ గోపీపై గతంలో పెద్దగా వివాదాలేమీ లేకపోగా, ఆయన తాజా ప్రవర్తన విస్మయం కలిగిస్తోంది. ఉత్తర కోజికోడ్ లో జరిగిన ఓ కార్యక్రమం సురేశ్ గోపీని మీడియా పలకరించింది. సురేశ్ గోపీ తనకు సమీపంలో నిల్చుని మైక్ పట్టుకుని ఉన్న మహిళా జర్నలిస్టు భుజంపై చేయి వేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె నవ్వుతూనే ఆయన చేయిని తొలగించారు. తర్వాత కాసేపటికి సురేశ్ గోపీ మరోసారి ఆమె భుజంపై చేయి వేశారు. ఆమె మళ్లీ ఆ చేతిని తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సురేశ్ గోపీ తీరుతో ఆ పాత్రికేయురాలు ఇబ్బందిపడినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. దాంతో, సీనియర్ నటుడి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, సురేశ్ గోపీ క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమెను తన కుమార్తెగా భావించి చనువుగా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు. వాత్సల్యంతోనే భుజంపై చేయివేశానే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా, ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు.
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీకర దాడి చేసింది. సుమారు 100 ఫైటర్ జెట్స్ తో అటాక్ చేస్తోంది. హమాస్‌కు చెందిన వందలాది టార్గెట్లను ధ్వంసం చేశారు.సుమారు వంద ఫైటర్ జెట్స్తో అటాక్ చేశామని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషనన్స్ బ్రిగేడర్ జనరల్ గిలాడ్ కీనన్ తెలిపారు. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఉత్తర భాగాన్ని ఇజ్రాయిల్ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌కు చెందిన టెంపోను ఇజ్రాయిల్ ఆర్మీ పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది. భారీ స్థాయిలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వైమానిక దాడితో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి.





Total views : 197425