మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. హింగోలితో పాటు పొరుగున ఉన్న నాందేడ్, పర్భానీ, వాషిమ్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కూడా భూకంప ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నాందేడ్ నగరంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని, ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయని స్థానికులు తెలిపారు. అ ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు ధ్రువీకరించారు. గత ఏడాది జూలైలో కూడా ఇదే ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
93
previous post





Total views : 81438