Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home TelanganaKarimnagar రెండు ప్రాణాలు తీసిన భూమి వివాదం..

రెండు ప్రాణాలు తీసిన భూమి వివాదం..

by Rama
murder

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న భూమి వివాదంతో ఒకరి ఆత్మహత్య (Suicide) కు పాల్పడగా మరొకరి హత్య(Murder)కు దారి తీసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన పులి రేణ(43) అనే వివాహిత ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన ఆమె భర్త పులి గంగయ్య భార్య మృతిని తట్టుకోలేక ఆమె మరణానికి పక్కింటి పులి పద్మ నే కారణమని భావించి కళ్ల్లు తీసే కత్తి తో దాడికి పాల్పడగా పద్మ సంఘటన స్థలంలోనే చనిపోయింది. అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రేణ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికుల ద్వారా తెలియ వచ్చింది. మరోవైపు ఈ రెండు కుటుంబాల మధ్య భూ సంబంధమైన వివాదాలు గత కొన్ని ఏళ్లు గా ఉన్నట్లు తెలుస్తుంది. హత్యకు పాల్పడిన గంగయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మంగళవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇది చదవండి: తెలంగాణలో 18 జిల్లాలు ఔట్?


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: