Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..!

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..!

by Satya
Huge encounter in Chhattisgarh

Chhattisgarh:

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. బీజాపూర్(Bijapur) జిల్లాలోని చికుర్ బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టుల(Maoists)కు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా.. భద్రతా బలగాల రాకను పసిగట్టి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మిగతా మావోయిస్టుల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉందని వెల్లడించాయి. మావోయిస్టుల డంప్ లో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను గుర్తించామని అధికారులు తెలిపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: బీజేపీలో చేరిన నవీన్ జిందాల్..


నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై …
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: