Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh ఏలూరు లో కిలాడీ డాక్టర్..!

ఏలూరు లో కిలాడీ డాక్టర్..!

by Prakash
medical crime

ఏలూరు లో వైద్యుడి దారుణం… | Medical Crime

ఏలూరు(eluru)లో ఓ వైద్యుడు దారుణానికి తెగబడ్డాడు. రిటైర్డ్ ఉద్యోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చాడు. ఆపై ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకున్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చొదిమెళ్లకు చెందిన బత్తిన మల్లేశ్వరరావు (63) పోస్టల్‌శాఖలో పనిచేసి రిటైరయ్యారు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావుతో సన్నిహితంగా మెలిగే వైద్యుడు గతేడాది డిసెంబరు 24న ఆయన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆయన ఒక్కడే వుండడాన్ని గమనించిన భానుసుందర్.. వైద్యం నెపంతో ఇంజక్షన్ ఇవ్వడంతో మల్లేశ్వరరావు మత్తులోకి జారుకున్నారు. అనంతరం ఇంట్లోని బంగారు నగలు, నగదు దోచుకుని పరారయ్యాడు.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మత్తు ఇంజక్షన్ కారణంగా మగతలోకి వెళ్లిపోయిన మల్లేశ్వరరావు ఆ తర్వాత కోలుకోలేక చనిపోయారు. కుటుంబ సభ్యులు తొలుత దానిని సహజ మరణంగానే భావించారు. అయితే, భానుసుందర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో నిలదీశారు. ఆ తర్వాతి నుంచి అతడు కనిపించడం మానేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భానుసుందర్ కోసం గాలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఏలూరు త్రీటౌన్ పరిధిలో వైద్యం పేరుతో నిందితుడు ఇలా రోగులను దోచుకున్నట్టు తెలిసింది. ఏలూరు త్రీటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లలో భానుసుందర్‌పై ఇప్పటికే కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: