Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra Pradesh ఏపీ మంత్రి వర్గం లోకి మెగా బ్రదర్ నాగబాబు

ఏపీ మంత్రి వర్గం లోకి మెగా బ్రదర్ నాగబాబు

by Rama
ఏపీ మంత్రి వర్గం లోకి మెగా బ్రదర్ నాగబాబు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో పాటుగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు. అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా.. జనసేన పార్టీకీ నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్‌లో జనసేన బలం మరింత పెరగనుంది.

ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం 25 మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే, ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం, జనసేనకు నాలుగు మంత్రి పదవులు, బీజేపీకి ఒక పదవి కేటాయించాల్సి ఉంది. అందులో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
  • కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.
    తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
  • రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.
    రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
  • స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
  • పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.
    పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: