Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News సౌదీ అరేబియాలో భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు.

సౌదీ అరేబియాలో భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు.

by CVR NEWS

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆయా దేశాధినేతలతో ప్రధాని మోదీ సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతోన్న దాడులను ప్రధాని మోదీ ఖండించారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగడం, ఆయా మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సౌదీ అరేబియాలో భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇరాన్‌పై ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా దాడులు మొదలుపెట్టాయి. వీటికి ప్రతీకారంగా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌, ఇరాన్‌, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, మలేషియా దేశాధినేతలతో ఇటీవల సంభాషించిన ప్రధాని మోదీ.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. సౌదీ అరేబియా యువరాజుతో నెల రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రెండోసారి మాట్లాడటం విశేషం.

Advertisements

You may also like

Our Visitor

039228
Total views : 194876

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: