Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News కర్ణాటకలో పవర్ ప్లే.. ఢిల్లీకి చేరిన కుర్చీలాట..

కర్ణాటకలో పవర్ ప్లే.. ఢిల్లీకి చేరిన కుర్చీలాట..

by CVR NEWS
కర్ణాటకలో పవర్ ప్లే.. ఢిల్లీకి చేరిన కుర్చీలాట

కర్ణాటక పాలిటిక్స్‌లో ఇప్పుడు ఒకటే టెన్షన్.. ఒకటే సస్పెన్స్.. కుర్చీ ఒకటే.. కుస్తీ పట్టేవాళ్లు ఇద్దరు.. గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా సాగుతున్న పవర్ షేరింగ్ కోల్డ్ వార్.. ఇప్పుడు నేరుగా ఢిల్లీ వీధులకు చేరింది. బెంగళూరులో మొదలైన కుర్చీలాట.. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో క్లైమాక్స్‌కు చేరింది. మూడేళ్ల ముచ్చట తీరింది.. ఇక పీఠం మారాల్సిందేనని ఒకరు.. కొడుకు కోసం కోటను కాపాడుకోవాలని మరొకరు. ఒకవైపు మాస్ లీడర్ సిద్ధరామయ్య.. మరోవైపు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్.. సీన్ కట్ చేస్తే.. ఢిల్లీలోని ఇందిరా భవనం ఇప్పుడు పొలిటికల్ పంచాయతీకి అడ్డాగా మారింది. అయితే గంటల తరబడి చర్చల తర్వాత సీఎం మార్పు లేదంటూ కాంగ్రెస్ హై కమాండ్ కుండబద్ధలు కొట్టింది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చింది.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు ముగియడంతో.. ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం నాయకత్వ మార్పు జరగాలని డీకే శివకుమార్ వర్గం గట్టిగా పట్టుబడుతోంది. మిగిలిన రెండేళ్ల కాలానికి ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కే అప్పగించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేలా సిద్ధరామయ్యను ఒప్పించేందుకు హైకమాండ్ ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగింది. సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం..ఆయన కుమారుడు యతీంద్రకు కర్ణాటక క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వడం వంటి ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వచ్చినా..తాజా చర్చల తర్వాత అలాంటిదేమీ లేదని స్పష్టమైంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: