Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News పహల్గామ్ టెర్రర్ అటాక్‌ జరిగి నేటికి ఏడాది పూర్తి…

పహల్గామ్ టెర్రర్ అటాక్‌ జరిగి నేటికి ఏడాది పూర్తి…

by CVR NEWS

పహల్గామ్ టెర్రర్ అటాక్‌ జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా..భారత్ ఎప్పటికీ తలవంచదని..ఉగ్రవాదుల హీనమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.

గతేడాది సరిగ్గా ఇదే రోజున పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు TRF ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని .. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరి.. వారి కుటుంబ సభ్యుల కళ్లెదుటే అతి సమీపం నుండి కాల్చి చంపారు ఉగ్రమూకలు.

ఈ దాడిపై NIA దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇప్పటికే హతమార్చాయి.. ఉగ్రవాదులకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేసి.. విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్‌పై దాడులు చేసి చావుదెబ్బ కొట్టింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: