తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె. నవంబర్ 3వ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి.. వ్యతిరేక ఓటును చీల్చటం ద్వారా.. కేసీఆర్ గెలుపునకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామె. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని.. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం అయినప్పుడు.. వ్యతిరేక ఓట్లు చీల్చటం వల్ల ఉపయోగం లేదని సలహా, సూచన చేశారాన్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి.. కేసీఆర్ సీఎం అయితే.. చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె.
Political
గంగవరం మండలంలో జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమాన్ని ఎస్ఎల్బీ కళ్యాణమండపం లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథులు నాయకులు ప్రజల సమస్యలను తీర్చడం మా ప్రధాన అంశం. టోల్ ప్లాజా నెంబర్ 1902 కాల్ చేస్తే మీ పరిష్కారం అంటూ నాయకులు తెలుపుతున్నారు. స్పందన కార్యక్రమంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా జగనన్నకు చెబుదాం రా అనే కార్యక్రమంలో ప్రజల సమస్యలు తీరుస్తామని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జెడ్పీ శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు చెప్పారు.
శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో పులి మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం నుంచి పదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్య హ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ను స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 18 వేల 212 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల సందర్భంగా ప్రలోభాలను, అక్రమాలను అరికట్టడానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ బృందాలు, ఒక వీడియో సర్వైలెన్స్ బృందం, ఒక అసిస్టెంట్ ఎక్సెండిచర్ అబ్జర్వర్ బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మెట్ లోని గండి మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మరియు బిజెపి శ్రేణులతో కలిసి తన ప్రచార దానికి కూడా పూజలు నిర్వహించారు. ప్రజలు ఈసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారని నోముల దయానంద్ గౌడ్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా వేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ చేపట్టిన వివిధ పథకాలే ప్రజలు మా వైపు నడిచే విధంగా చేశాయని బిజెపి అభ్యర్థి దయానంద గౌడ్ తెలిపారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి అని అడిగే సమయంలో అయ్యా మాకు టికెట్ కావాలి అని దీక్షలు చేయాల్సిన పరిస్థితి దుస్థితి మాకు కలిగింది. అంటే మా నాయకత్వం ఏం చేస్తుంది మా నాయకులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అసలు ఇంతవరకు కూడా ఏ రోజులో కూడా ప్రజా పోరాటంలో లేని వ్యక్తులు, ఇంతవరకు కూడా ఇక్కడున్న దుర్మార్గుడైన శాసనసభ్యున్ని ఎండగట్టని వ్యక్తులు మా పార్టీకి టికెట్ కావాలని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 10వ తారీఖు వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అధికారులు పరిశీలించనున్నారు. ఎస్సీ రిజర్వేషన్ నకిరేకల్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయనున్న అభ్యర్థులు అభ్యర్థులు 5000 రూపాయల డిపాజిట్ రుసుము చెల్లించవలసిందిగా అధికారులు తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు వేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. నామినేషన్ కేంద్రానికి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు. నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాలో రవీంద్ర కుమార్ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో కనీసం గ్రామంలో ఉన్న నీటి సమస్యను కూడా పరిష్కరించలేదని, బిఆర్ఎస్ నాయకులకు తమ గ్రామంలో పర్యటించే హక్కు లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ అక్కడ నుంచి పోలిసుల సహాయంతో వెనుతిరగడం జరిగింది.
సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎదుర్కోవాలంటే అస్త్రాలు అవసరం లేదు ఇక్కడ ఏ ఆడపడుచును అడిగిన వాళ్ళ కన్నీటి బొట్టు చెబుతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం అభివృద్ధి చేశారు అనేది. దళిత గిరిజన సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ గారు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట్ డివిజన్ బాపూనగర్ బస్తీలో గురువారం డాక్టర్ కోట నీలిమ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ బాపునగర్ బస్తీలో అనేక సమస్యలు ఉన్న స్థానిక నాయకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు మల్కాజిగిరి లో ప్రచారం నిర్వహించారు. ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మి సాయి గార్డెన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, మల్లారెడ్డి, శంబిపుర్ రాజు స్థానిక నాయకులు, ఉద్యమ కారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజిగిరి అభివృద్ధి చెందాలంటే గుండాలు కాదు సౌమ్యులు కావాలని అలాంటి మంచి వ్యక్తే మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అని ఆయనను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంది. మన లాంటి స్కీములు దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
శుక్రవారం నుండి నియోజక వర్గాలలో మరింత నిఘా బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అక్రమంగా విపరీతంగా నగదు, బంగారం ఇతర అభరణాలు, ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఒక వైపు మరోకవైపు పోలీస్ శాఖ తనిఖీలు, ఇంకొక వైపు ఇతర ప్రాంతాలనుండి వచ్చే ఆ క్రమంగా నగదు, వివిధ రకాల ఆభరణాలు, నిరోధించెందకు 18 చెక్ పోస్ట్ ల ఏర్పాటుచేశారు. మనీ మేనేజ్మెంట్ సంస్థల ను కూడా నగదు ప్రవాహం తనిఖీ చేసేందుకు వాహనాలకు జి పి యస్ సిస్టమ్ అమర్చి ఎప్పటి కప్పుడు పరిశీలన, మద్యం షాపులు వద్ద కూడా అక్రమ రవాణా తగ్గించేందుకు సిసి కెమెరా అమర్చి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటి కప్పుడు పరిశీలన చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్ పోస్ట్, వద్దకుడ సిసి కెమెరా లను పేట్టి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి పరిశీలన. జేసీ అక్కడ తప్పులను సరిదిద్ది సక్రమంగా చేసేందుకు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జిల్లా ఎన్నికల అధికారి తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నగదు ఆభరణాలు, మద్యం, మరక ద్రవ్యాలు, పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 45 కోట్ల 89 లక్షల రూపాయల విలువ గల సొత్తును పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజక వర్గంలో నవంబర్ 3 వ తేదీ నుండి. నామినేషన్ లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుండి స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ టీమ్ ల ను నియోజక వర్గం వారీగా ఏఒక్కొక్క నియోజక వర్గం లో 9 టీమ్ లను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పని చేసే విధంగా సిబ్బందిని నియిచడం జరిగింది ప్రతి నియోజక వర్గం లో వేర్వేరు ప్రదేశాలలో స్టాటిస్టిక్స్ సర్వే లెస్ టీమ్ లను పని చేస్తూ అక్రమంగా ప్రవహిస్తున్న నగదు, ఆభరణాలు, మద్యం మత్తు పదార్థాల లైనా, గంజాయి, డ్రగ్స్ పట్టుకునేందుకు ఈ టీమ్ ల నిఘా చేస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని నగదు, ఆభరణాలు, సీజ్ చేసిన వాటిని ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పిర్యాదు ల కమిటీ ఏర్పాటు చేసి తద్వారా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు.



Total views : 92557