Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అక్రమ దందా ..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అక్రమ దందా ..

by CVR NEWS

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పర్మిషన్లతో బస్సులు నడపడం, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ ఆపరేట్ చేయడం వంటి చర్యలు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద దెబ్బగా మారుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెల్లించాల్సిన పన్నులు, ఫీజులు తప్పించుకునేందుకు కొన్ని ట్రావెల్స్ సంస్థలు పొరుగు రాష్ట్రాల పేర్లతో బస్సులు నడుపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం మళ్లీ ఇతర రాష్ట్రాలకు మళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఇక మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరగాల్సిన ఫిట్‌నెస్ పరీక్షలు, రెన్యువల్స్ విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆ బస్సులు అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నాయా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ అధికారుల పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దందాను అరికట్టేందుకు సమగ్ర విచారణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటేనే రాష్ట్రానికి జరుగుతున్న ఆదాయ నష్టాన్ని తగ్గించగలమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై మరింత సమాచారం కోసం విజయవాడ నుంచి మా న్యూస్ కోఆర్డినేటర్ ఏడుకొండలు వివరాలు అందించనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: