Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Film రోటి క‌ప‌డా రొమాన్స్ చిత్రం నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుద‌ల

రోటి క‌ప‌డా రొమాన్స్ చిత్రం నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుద‌ల

by Rama
Roti Kapada Romance

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మై ఫ్రెండ్ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిగ్‌బాస్ ఫేమ్‌, ప్రముఖ న‌టుడు శివాజీ, స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌, ర‌చ‌యిత ప్ర‌స‌న్న‌కుమార్‌లు ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఈ సంద‌ర్భంగా శివాజీ మాట్లాడుతూ ఇటీవ‌ల నేను ఈ సినిమా చూశాను. నేటి యూత్‌కు న‌చ్చే ట్రెండీ సినిమా ఇది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో వున్న న‌టీన‌టులు అంద‌రూ చాలా చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి చిత్రాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌రో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు దొరికాడు. నాకు న‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కులంద‌రికి కూడా న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు. న‌క్కిన త్రినాథ‌రావు మాట్లాడుతూ ఈ సినిమా పోస్ట‌ర్ చూస్తుంటే, ఈ బ్యాన‌ర్‌లో నేను చేసిన మేం వ‌య‌సుకు వ‌చ్చాం రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా ట్రెండీ టైటిల్ ఇది. కంటెంట్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించి అంద‌రికి మంచి పేరును తీసుక‌రావాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.

ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ సినిమా నిర్మాణం మీద‌, క‌థ మీద నాలెడ్జ్‌, గ్రిప్ వున్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. కొత్త‌వాళ్ల‌తో సినిమా తీయ‌డం ఈ రోజుల్లో ఎంతో గ‌ట్స్ వుండాలి. ఈ సినిమా కంటెంట్ మీద న‌మ్మ‌కం వుంది. మ్యాట‌ర్ వున్న సినిమాలా అనిపిస్తుంది అన్నారు. యానిమ‌ల్ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించార‌ని, ఈ పాట చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు నా స్నేహితులు గుర్తుకు వ‌చ్చార‌ని, ఆల్ ఎమోష‌న్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర దర్శ‌కుడు విక్ర‌మ్ రెడ్డి తెలిపారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ పెద్ద సినిమాల‌తో పోటిప‌డే గ‌ట్టి కంటెంట్‌తో నిర్మించిన చిత్ర‌మిది. ఫ్రెండ్‌షిప్ అనేది ఎవ‌ర్ గ్రీన్‌, ఈ పాట కూడా త‌ప్ప‌కుండా అంద‌రి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది. పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ స‌మ్మ‌ర్‌కు పెద్ద విజ‌యాన్ని అందుకుంటుంది అన్నారు.

ఈ స‌మావేశంలో హ‌ర్ష‌, త‌రుణ్‌, సందీప్‌, సుప్ర‌జ్‌. కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్ సోనూ ఠాకూర్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.భ‌ర‌త్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి.భ‌ర‌త్ రెడ్డి
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి

ఇదిచదవండి : ఎఫ్ ఎన్ సి సి పన్నెండవ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్..


అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.
పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో …
త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.
టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, …
దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌.
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039242
Total views : 194938

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: