ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్తులు… ఈ రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టోర్నీలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికల నేపథ్యంలో, ఈ మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది. అయితే, మ్యాచ్ జరిపేందుకే ఐసీసీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
Sports
దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘క్లాస్ ఇన్నింగ్స్. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉండవు’ అంటూ వెంకటేశ్ క్యాప్షన్ ఇచ్చారు.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 8 విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమ్ఇండియా 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తొలుత భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ జట్టును కుప్పకూల్చాడు.
వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ స్పష్టం చేసింది. మొదట అతడు సెమీఫైనల్స్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడం కష్టంగా మారింది. దాంతో మిగిలిన టోర్నీకి హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండబోవడం లేదని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిధ్ కృష్ణ భారత జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.
బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( ఏసీఏ) పర్యవేక్షణలో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు అండర్ –19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ మూలపాడులోని డీవీఆర్, సీపీ గ్రౌండ్లలో నిర్వహిస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. గురువారం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ జాయింట్ సెక్రెటరీ ఎ. రాకేష్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ జితేంద్రనాథ్ శర్మతో కలిసి ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు, మన దేశం తరపున ఇండియా–ఎ, ఇండియా– బి జట్లుగా పాల్గొంటాయి. మొత్తం నాలుగు జట్లు టోర్నమెంట్ లో పాల్గొంటాయని తెలిపారు. ఈ నెల 5న ఇంగ్లాండ్ జట్టు విజయవాడకు వచ్చి మూలపాడులో నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది. బంగ్లాదేశ్ జట్టు 10వ తేదీన విజయవాడకు చేరుకుంటుంది. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు న్నాము. అదేవిధంగా వైజాగ్ లోని డా. వైయస్సార్ ఏసీఏ – విడి సీఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ – 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
మూలపాడులో నిర్వహించనున్న8 మ్యాచ్ షెడ్యూల్..
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
తేదీ మ్యాచ్ వేదిక
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
13–11–23 ఇండియా (ఎ) – బంగ్లాదేశ్ డీవీఆర్ గ్రౌండ్
13–11–23 ఇండియా (బి) – ఇంగ్లాండ్ సీపీ గ్రౌండ్
15–11–23 ఇండియా (బి) – బంగ్లాదేశ్ డీవీఆర్ గ్రౌండ్
15–11–23 ఇండియా (ఎ) – ఇంగ్లాండ్ సీపీ గ్రౌండ్
17–11–23 ఇండియా (ఎ) – ఇండియా (బి) డీవీఆర్ గ్రౌండ్
17–11–23 ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ సీపీ గ్రౌండ్
20–11–23 ఇండియా (బి) – ఇంగ్లాండ్ డీవీఆర్ గ్రౌండ్
20–11–23 ఇండియా (ఎ) – బంగ్లాదేశ్ సీపీ గ్రౌండ్
22–11–23 ఇండియా (ఎ) – ఇంగ్లాండ్ డీవీఆర్ గ్రౌండ్
22–11–23 ఇండియా (బి) – బంగ్లాదేశ్ సీపీ గ్రౌండ్
24–11–23 ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ డీవీఆర్ గ్రౌండ్
24–11–23 ఇండియా (ఎ) – ఇండియా (బి) సీపీ గ్రౌండ్
27–11–23 ఫైనల్ డీవీఆర్ గ్రౌండ్
27–11–23 3వ ప్లేస్ సీపీ గ్రౌండ్
ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులు హస్టరీ క్రియేట్ చేసింది అదే దారిలోనే చైనాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లోనూ ప్లేయర్లు సత్తా చాటారు. ఈ గేమ్స్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే భారత్ అన్ని కలిపి 73కు పైగా పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ పారా ఏషియన్ గేమ్స్‌లో 100 పతకాలు సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. 2018 లో జరిగిన టోర్నీలో భారత్ మొత్తం 72 పతకాలను మాత్రమే అత్యధికంగా గెలుచుకొగలిగింది. అయితే ఇవాళ కూడా మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, పారా ఆసియా గేమ్స్‌లో వంద పతకాలు సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. భారత్ పారా ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనం ఆనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వివిఎస్.లక్ష్మణ్ విరాళంగా అందించారు.దాదాపు 14 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టిటిడి ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 173 ఓట్లలో 169 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. Hca పీఠం ఎవరికి దక్కనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ప్రెసిడెంట్ రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలత ప్రెసిడెంట్ స్థానాన్నే అనౌన్స్ చేయనున్నారు ఎన్నికల అధికారి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా మిథాలీ రాజ్, వెంకటపతి రాజు, స్రవంతి పలువురు క్లబ్ నెంబర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.





Total views : 81790