అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచు వర్షం ముప్పు లేదని స్పష్టం చేసింది. స్టేడియం పరిధిలో నేడు కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20, 34°Cగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అతిరథ మహారథుల మధ్య విశ్వ పోరు ఎలాంటి ఆటంకం లేకుండా జరగనుంది. వరల్డ్ కప్ ట్రోఫీని ఇండియా గెలుస్తుందని అంతా ధీమాగా ఉన్నారు. ఈక్రమంలో గత టోర్నీల్లో గెలిచిన జట్టులపై అభిమానులు రీసెర్చ్ మొదలెట్టారు. ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. గత మూడు టోర్నీల్లోనూ ట్రోఫీకి కుడివైపు ఉన్న కెప్టెన్ జట్టు గెలుస్తూ వస్తోంది. ఈ లెక్కన ఈరోజు జరిగిన ఫొటోషూట్లోనూ ట్రోఫీకి కుడివైపున రోహిత్ శర్మ నిల్చున్నారు. దీంతో కప్ మనదేనంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై కరీంనగర్ నుండి మా కరస్పాండెంట్ సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు.
Sports
యావత్తు ప్రపంచం ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులు పెద్ద పండుగగా అభివర్ణిస్తున్నారు. కాకినాడ రూరల్ జనసేన టిడిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీలను ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టులు పెడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు టీం ఇండియా అభిమానులు ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. చిన్నా పెద్ద ఆడ మగ తేడా లేకుండా క్రికెట్ చూసేందుకు ఇక్కడ వనభోజనాల్లో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మాకు కాకుండా జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు.
Read Also..
Read Also..
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది. దేశం మొత్తం క్రికెట్ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ జట్టు గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి ఆలయంలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోరుతో నెల్లూరు జిల్లాలో సందడి మారింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమ్యయే మ్యాచ్ ను వీక్షించేందుకు హోటలలో ప్రత్యేక స్క్రీన్ లు ఏర్పాటు చేసారు. మరోవైపు జోరుగా బెట్టింగులు జరుగుతున్నా పోలీసులు పట్టించు కోవడం లేదు. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. బలమైన ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించి భారత్ క్రికెట్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవాలని 140కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Read Also..
Read Also..
గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి క్రికెట్ పోరు జరగనుంది. ఇదివరకే భారత్ రెండు సార్లు క్రికెట్ కప్ గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఐదు పర్యాయాలు గెలుచుకొని కప్ కైవసం చేసుకుంది. మధ్యాహ్నం జరగనున్న పైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు రసవత్తరంగా తలపడనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అభిమానుల కోసం అన్ని జిల్లాల్లో భారీ స్ర్కీన్ లను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల క్రికెటర్లు ప్రపంచ కప్ తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి కప్ ని భారత్ గెలుచు కుంటుందా లేక ఆస్ట్రేలియాకి కట్ట బెడుతుందా అన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రపంచమంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. ప్రపంచ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో జోష్ లో ఉన్న టీమిండియా ఈరోజు జరిగే ప్రపంచ వరల్డ్ కప్ లో విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఏలూరుకు చెందిన మేతర సురేష్ అనే సూక్ష్మ కళాకారుడు ఒక చెక్కపై క్రికెట్ స్టేడియం ను తయారుచేసి అరంగులం అగ్గిపుల్లలపై భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్స్ ను చెక్కి, ఆస్ట్రేలియా క్రీడాకారులు ఫీల్డింగ్ చేస్తున్నట్టుగా, భారత్ క్రీడాకారులు బ్యాటింగ్ చేస్తున్నట్లు కళాకాండాలను తీర్చిదిద్దాడు. వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించి కప్పును కైవసం చేసుకుందని భావిస్తూ ఒకవైపు జాతీయ జెండాలను చెక్కి, మరోవైపు దోస గింజపై వరల్డ్ కప్ తయారుచేసి అబ్బురుపరిచారు.
నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్ పండుగ ముంగిపు దశకు చేరింది. ట్రోఫీ కోసం నేడు జరిగే ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్ కొమ్ములు వంచి మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు. క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్ కప్ ఫైనల్. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్ కప్ ఫైనల్. ఇరుజట్లకు ఇది రెండో టైటిల్ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 20 ఏళ్ల తర్వాత నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ప్రస్తుత సమీకరణాలను బటిచూస్తే భారతజట్టే హాట్ ఫేవరెట్. రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోడీ, ఆసీస్ ఉప ప్రధాని రిచర్డ్ మార్ల్స్ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. మైదానంలోని 1.30లక్షల మంది ప్రేక్షకులతోపాటు, కోట్లాది క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎయిర్ షో, డ్రింక్స్ ఇన్నింగ్స్ మధ్యలో సంగీత విభావరి, చివరగా లేజర్ షో ప్రదర్శించనున్నారు.
ఫిఫా వరల్డ్ కప్-2026 కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఆసియా స్థాయిలో జరిగిన ఫిఫా క్వాలిఫయర్స్ లో భారత్ గెలుపు బోణీ కొట్టింది. కువైట్ తో జరిగిన రెండో రౌండ్ పోరులో భారత్ 1-0తో విజయం సాధించింది. భారత్ తరఫున ఏకైక గోల్ ను మన్వీర్ సింగ్ సాధించాడు.
కువైట్ నగరంలోని జబేర్ అల్ అహ్మద్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత్ జోరు ప్రదర్శించింది. క్రొయేషియా సాకర్ దిగ్గజం ఇగోర్ స్టిమాక్ కోచ్ గా వచ్చాక భారత్ ఆటతీరు యూరోపియన్ శైలిలోకి మారింది. వేగవంతమైన పాస్ లు, ప్రత్యర్థి డిఫెండర్లను, గోల్ కీపర్ ను ఏమార్చే ఎత్తుగడలను భారత ఆటగాళ్లు వంటబట్టించుకున్నారు. ఈ విజయంతో భారత్ కు 3 పాయింట్లు లభించాయి. తొలి అర్ధభాగంలో భారత్, కువైట్ జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే రెండో అర్ధభాగంలో మన్వీర్ సింగ్ గోల్ చేసిన గోల్ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపింది. ఈ ఫిఫా క్వాలిఫయింగ్ రౌండ్లలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఖతార్ తో నవంబరు 21న భువనేశ్వర్ లో ఆడనుంది. భారత్ ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్ లో 102వ స్థానంలో ఉంది. ఖతార్ 61వ ర్యాంకు జట్టు. ఖతార్ కు వరల్డ్ కప్ లలో ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తనకంటే మెరుగైన ర్యాంకింగ్, అనుభవం ఉన్న ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరమైన అంశం. అయితే, ఈ మ్యాచ్ సొంతగడ్డపై ఆడనుండడం భారత్ కు కలిసొచ్చే అంశం.
Read Also..
ఈ నెల 23న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ ఆఫ్ లైన్ టిక్కెట్లు విక్రయం. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, వన్‌టౌన్ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు విక్రయించనున్నారు. టిక్కెట్ ధరలు.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే హాట్ కేక్ ల అమ్మడుబోయిన ఆన్ లైన్ టిక్కెట్లు ఆన్ లైన్ లో చాల వరకు టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆఫ్ లైన్ లో టిక్కెట్లు కోసం క్రికెట్ అభిమానులు బారులు తీరుతున్నారు.
ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసింది. ఐసీసీ మెగా టోర్నీలో ఫైనల్స్ కు చేరిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. 7 వికెట్లను కూల్చి మహ్మద్ షమీ కివీస్ ను మట్టికరిపించాడు. టీమిండియా ప్రదర్శనకు ప్రధాని మోదీ కూడా ఫిదా అయిపోయారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, షమీలపై ప్రశంసలు కురిపించారు. వన్డేల్లో కోహ్లీ తన 50వ సెంచరీని సాధించడమే కాక… అత్యుత్తమ క్రీడాస్ఫూర్తికి, పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడని మోదీ ప్రశంసించారు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం అతని అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్ తరాలకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్ ను నెలకొల్పుతూనే ఉన్నాడని కొనియాడారు. ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ ప్రతిభను కనపరిచిన షమీకి అభినందనలను తెలుపుతున్నానని చెప్పారు. షమీ ఎంతో బాగా ఆడాడని… ఆయనను భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తాయని అన్నారు.





Total views : 194211